News June 27, 2024

అఫ్గాన్ బౌలర్ ప్రపంచ రికార్డు

image

ఒక T20WC ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు(17) తీసిన బౌలర్‌గా అఫ్గాన్ ప్లేయర్ ఫజల్హక్ ఫరూకీ రికార్డు సృష్టించారు. 2021WCలో హసరంగ 16, 2012WCలో అజంతా మెండిస్ 15, 2022WCలో హసరంగ 15 వికెట్లు పడగొట్టారు. కాగా ఈ ఏడాది 15 వికెట్లతో అర్ష్‌దీప్ రెండో స్థానంలో ఉన్నారు. ఇవాళ ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్, ఇందులో గెలిస్తే సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ ఉండటంతో అత్యధిక వికెట్ల రికార్డును అతను బ్రేక్ చేసే అవకాశం ఉంది.

Similar News

News November 3, 2025

కాలేజీల బంద్ కొనసాగిస్తాం: ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్

image

TG: కాలేజీల <<18182444>>బంద్<<>> కొనసాగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్ రమేశ్ నాయుడు అన్నారు. ‘నిరసన ఉద్ధృతం చేస్తాం. రేపటి నుంచి జరిగే డిగ్రీ పరీక్షలను బహిష్కరిస్తాం. మాకు రావాల్సిన బకాయిల్లో సగం వెంటనే విడుదల చేయాలి. NOV 8న HYDలో సభ, 11న 10L మంది విద్యార్థులతో ఛలో HYD పేరుతో నిరసన చేపడతాం. ప్రభుత్వం మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది’ అని ఆరోపించారు.

News November 3, 2025

నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – కట్టడికి సూచనలు

image

ట్రైకోడెర్మావిరిడె/సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 2 కేజీల మందును.. 90 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండితో కలిపి నీడలో పొరలు పొరలుగా ఒక కుప్పగా వేసుకోవాలి. దానిపై గోనెకప్పి బెల్లం కలిపిన నీటిని ఒక వారం పాటు చల్లాలి. దీని వల్ల దానిలో శిలీంద్రబీజాలు/బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. ఇలా తయారైన దానిని పశువుల ఎరువుతో కలిపి ఎకరా పొలంలో చల్లుకోవాలి. ఇది నేలసారాన్ని పెంచి తెగుళ్ల ఉద్ధృతిని తగ్గిస్తుంది.

News November 3, 2025

చెత్త పనులు చేయడం వైసీపీకి పరిపాటిగా మారింది: మంత్రి లోకేశ్

image

AP: డ్రగ్స్ సరఫరా చేస్తున్న YCP స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కొండారెడ్డిని ఈగల్ టీమ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘డ్రగ్స్ వద్దని ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే YCP పాత వాసనలు వదులుకోవట్లేదు. చెత్త పనులు చేయడం, రాష్ట్రంలో ఏదో అయిపోతుందంటూ హడావుడి చేయడం పరిపాటిగా మారింది. YCP ఫేక్ పార్టీ అని అనేది అందుకే. ఆ పార్టీ నడిపేది స్టూడెంట్ వింగ్ కాదు, డ్రగ్స్ వింగ్’ అని ఆరోపించారు.