News March 26, 2024
ఘోరం.. భారత్‌కు షాకిచ్చిన అఫ్గానిస్థాన్

భారత ఫుట్‌బాల్ జట్టుకు పసికూన అఫ్గానిస్థాన్ షాకిచ్చింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో భారత్ 1-2తేడాతో అఫ్గాన్ చేతిలో ఓడింది. ఇది ఇండియా కెప్టెన్ సునీల్ ఛెత్రీకి 150వ మ్యాచ్ కావడం విశేషం. ఇందులో సునీల్ తన కెరీర్‌లో 94వ గోల్ కూడా కొట్టారు. ఇది భారత ఫుట్‌బాల్ జట్టు చరిత్రలో ఘోరమైన ఓటమిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News March 28, 2026
టార్గెట్ 300.. ఏ టీమ్ కొడుతుందో?

కొన్నేళ్లుగా IPL టీమ్‌లను ఊరిస్తున్న స్కోర్ 300. ఈసారి ఆ స్కోర్ గ్యారంటీ అంటూ SRH కెప్టెన్ ఇషాన్ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్లే జట్టులో హెడ్, అభిషేక్, క్లాసెన్, ఇషాన్, లివింగ్‌స్టోన్ వంటి హిట్టర్లున్నారు. IPLలో టాప్ 5 హయ్యెస్ట్ స్కోర్ల(287/3, 286/6, 278/3, 277/3, 272/7)లో తొలి 4 SRHవే. మిగతా జట్లలోనూ భీకర బ్యాటర్లున్నారు. మరి ఈ సీజన్‌లో 300ను ఏ జట్టు కొట్టగలదో కామెంట్ చేయండి.
News March 28, 2026
H-1B ఉద్యోగుల వేతనాల్లో భారీ పెంపు!

USలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల వేతనాలను పెంచుతూ లేబర్ డిపార్ట్‌మెంట్ కొత్త ప్రతిపాదనలు చేసింది. H-1B, E-3 వంటి వీసాదారులకు ఇచ్చే మినిమం శాలరీ పెరగనుంది. దీనివల్ల ఏటా ఒక్కో ఉద్యోగికి ₹13 లక్షల అదనపు లబ్ధి చేకూరనుంది. విదేశీయులకు తక్కువ జీతాలిచ్చి స్వదేశీయులను తొలగించకుండా ఉండేందుకే 20 ఏళ్ల పాత వేతన విధానాన్ని మారుస్తున్నారు. వీటిపై అభిప్రాయాలు సేకరించి అమలు చేస్తారు.
News March 28, 2026
ఆయిల్ పామ్ తోటల్లో పరాగసంపర్కం

ఆయిల్ పామ్ తోటల్లో పరాగ సంపర్కం గాలి ద్వారా, కీటకాల ద్వారా జరుగుతుంది. ఇలాయిడోబియస్ కామెరూనికస్ అనే కీటకం పరాగ సంపర్కంలో కీలకపాత్ర వహిస్తుంది. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన 2.5 సంవత్సరాల తర్వాత తోటల్లో ఈ కీటకాలను విడుదల చేస్తే ఫలదీకరణ బాగా జరిగి ఫలములు ఏర్పడతాయి. చెట్లు ఆరోగ్యంగా లేకపోతే ఈ కీటకాలను 3 సంవత్సరాల తర్వాత తోటల్లో విడుదల చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


