News July 17, 2024

పాస్‌వర్డ్ ఇచ్చేందుకు భయపడి సముద్రంలో దూకేశాడు!

image

ప్రియురాలికి ఫోన్ పాస్‌వర్డ్ ఇవ్వడం కంటే సముద్రంలో దూకేయడం బెటర్ అనుకున్నాడో ప్రియుడు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఏజే అనే వ్యక్తి ప్రియురాలితో కలిసి బోట్‌పై విహారానికి వెళ్లాడు. వీరి పడవను నిఘా పోలీసులు ఆపడంతో బాస్‌కు ఫోన్ చేసేందుకు ప్రియురాలు ఏజేని పాస్‌వర్డ్ అడిగింది. చెప్పడం ఇష్టం లేని అతడు నీటిలో దూకి ఒడ్డుకు వెళ్లిపోయాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు ఏజేని అరెస్టు చేశారు.

Similar News

News December 7, 2025

ఖమ్మం: ‘పంచాయతీ’ పోరు ఉద్ధృతం!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1042 పంచాయతీల్లో మూడు విడతల (డిసెంబర్ 11, 14, 17) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గుర్తులు కేటాయించిన తొలి, రెండో విడత అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రాత్రి వేళల్లో ఆర్థిక హామీలతో మంతనాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, తమ ఎమ్మెల్యేలు, కీలక నేతలను రంగంలోకి దించడంతో పల్లెపోరు మరింత వేడెక్కింది.

News December 7, 2025

విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా

image

TG: విద్యార్థి స్కూలుకు రాలేదని టీచర్లు ధర్నా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం నుంచి స్కూలుకు రావట్లేదు. పేరెంట్స్‌ని అడిగితే సమాధానం లేదు. దాంతో ఆ ప్రాథమిక పాఠశాల టీచర్లు మిగిలిన విద్యార్థులతో కలిసి ఆ పిల్లాడి ఇంటి ముందు బైఠాయించారు. సోమవారం నుంచి పిల్లాడిని బడికి పంపుతామని పేరెంట్స్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

News December 7, 2025

ఆ లంబాడీలు ఎస్టీలు కాదు: హైకోర్టు

image

TG: 1956 తర్వాత మహారాష్ట్ర నుంచి వలస వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ లంబాడీలు ఎస్టీ క్యాటగిరీ కిందకు రాబోరని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ఎస్టీ సర్టిఫికెట్‌ను రద్దు చేశారని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హాన్ దేవానంద్ కుటుంబం హైకోర్టుకు వెళ్లింది. 1950 నాటికి తెలంగాణలో నివసించే లంబాడీలు, వారి పూర్వీకులు, మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడీలకు మాత్రమే ఎస్టీ క్యాటగిరీ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.