News October 29, 2024
అంతరించిపోయే దశలో ఆఫ్రికన్ పెంగ్విన్స్

నలుపు, తెలుపు రంగులలో విలక్షణంగా కనిపించే ఆఫ్రికన్ పెంగ్విన్స్ అంతరించిపోయే దశలో ఉన్నట్లు IUCN తెలిపింది. ప్రపంచంలోని 18 పెంగ్విన్ జాతులలో అంతరించిపోయే దశకు చేరుకున్న మొదటి జాతి ఇదేనని పేర్కొంది. ఆహారం దొరకకపోవడం, వాతావరణ మార్పులు, సంతానోత్పత్తి కాలనీల సమీపంలో చేపల వేట కొనసాగించడం వీటి మనుగడకు పెను ముప్పుగా మారాయంది. వీటి సంరక్షణకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని IUCN కోరింది.
Similar News
News February 1, 2026
‘మహామాఘి’ అంటే తెలుసా?

ఏడాదిలో వచ్చే 12 పౌర్ణమిలలో మాఘ పౌర్ణమి అతి పవిత్రమైనది. అందుకే దీనిని ‘మహామాఘి’ అంటారు. ఈరోజున చంద్రుడు మఖ నక్షత్రంతో ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. ఇది హరిహరులకు ప్రీతికరమైన రోజు. ఈ మాసంలో దేవతలందరూ గంగానదిలో నివసిస్తారట. అందుకే నేడు చేసే నదీ స్నానం అనంతమైన పుణ్యఫలాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ పర్వదినం మానవాళికి ఆధ్యాత్మిక శక్తిని, ఆరోగ్యకరమైన జీవనానికి కావలసిన సంకల్పాన్ని అందిస్తుంది.
News February 1, 2026
NABARDలో 162 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 1, 2026
మిల్లర్లు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే వరి రకాలు

అత్యధిక దిగుబడి, అధిక బియ్యం నాణ్యత, చీడపీడలను తట్టుకునే కొన్ని వరి రకాలకు మిల్లర్లు, వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సన్నగింజ రకాలైన BPT 5204(సాంబ మషూరి), WGL-44(సిద్ధి), KNM-1638(కూనారం వరి-2) వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అలాగే అతి సన్న రకాలైన RNR 15048(తెలంగాణ సోన), జై శ్రీరామ్, HMT సోన.. దొడ్డు పొడవు గింజ రకాలైన MTU-1010, KNM 118లకు కూడా మంచి ఆదరణ ఉంది.


