News March 30, 2024

కెప్టెన్సీకి అఫ్రిదీ గుడ్ బై?

image

పాకిస్థాన్ T20 కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. తన కెప్టెన్సీలో పాక్ ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ ఆయన వైదొలుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా పాక్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్ ఆజమ్ పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఆయనకు బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు టాక్.

Similar News

News September 15, 2025

ఈనెల 17న విశాఖలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఈనెల 17న విశాఖలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.15AMకి కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఆర్కే బీచ్ రోడ్డులో ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్లో పాల్గొంటారు. 12PMకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌‌లో ప్రసంగిస్తారు. అనంతరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.

News September 15, 2025

సూపర్-4కు దూసుకెళ్లిన టీమిండియా

image

ఆసియా కప్‌లో టీమిండియా సూపర్-4కు దూసుకెళ్లింది. తాజాగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో UAE ఘన విజయం సాధించడంతో భారత్‌‌కు లైన్ క్లియర్ అయింది. టీమిండియా ఇప్పటికే UAE, పాక్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. మెరుగైన నెట్ రన్‌రేట్(4.793) కారణంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-4కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం పాక్, UAE పోటీ పడనున్నాయి.

News September 15, 2025

BREAKING: కాలేజీలతో చర్చలు సఫలం

image

TG: కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. ప్రస్తుతం రూ.600కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి.