News August 17, 2024
20ఏళ్ల తర్వాత చెప్పులు ‘కలిపాయి’

MPకి చెందిన సురేశ్ మర్డర్ కేసులో 20ఏళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలయ్యాడు. మతిస్థిమితం కోల్పోయి ఫుట్పాత్పై పడుకోగా భిన్నంగా ఉన్న అతడి చెప్పులను చూసి కొందరు WB రేడియో క్లబ్కు సమాచారమిచ్చారు. మతిస్థిమితం లేక తప్పిపోయిన వారిని ఫ్యామిలీతో WBRC కలుపుతూ ఉంటుంది. ఆ చెప్పులు జైలులో ఇచ్చినవని గుర్తించి, ఫ్యామిలీ వివరాలు కనుక్కొని వారికి సమాచారం ఇచ్చింది. అలా ‘చెప్పుల’ వల్ల కుటుంబాన్ని కలిశాడతడు.
Similar News
News November 18, 2025
రెండు రోజులు జాగ్రత్త!

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది. ఉదయం 9 గంటలైనా తీవ్రత తగ్గడం లేదు.

మూవీ ముచ్చట్లు

*కల్ట్ క్లాసిక్ సినిమా ‘షోలే’ డిసెంబర్ 12న థియేటర్లలో రీరిలీజ్ కానుంది.
*మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. పూజా కార్యక్రమంతో హారర్ చిత్రం ప్రారంభం. సమర్పకుడిగా వ్యవహరించనున్న నీల్.
* ‘వారణాసి’ వీడియోకు అద్భుత స్పందన రావడంతో సాంకేతిక బృందానికి థాంక్స్ చెప్పిన రాజమౌళి. ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ ట్వీట్.