News July 4, 2024
కాసేపట్లో సీఎంగా హేమంత్ ప్రమాణ స్వీకారం

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న సీఎం చంపై సోరెన్ రాజీనామా చేయగా జేఎంఎం నేతృత్వంలోని కూటమి హేమంత్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు హేమంత్‌ను గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించారు. సాయంత్రం రాంచీలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
Similar News
News March 13, 2026
ఒంటిపూట బడులు.. ఉ.7.45 గంటలకే స్కూల్

AP: ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు జీవో జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందుతుందని పేర్కొన్నారు.
News March 13, 2026
విద్యార్థులూ.. ట్రిపుల్ ఐటీ ఎదురుచూస్తోంది!

TG: 2026-27కు సంబంధించి బాసర, మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను ఆర్జీయూకేటీ వీసీ గోవర్ధన్ విడుదల చేశారు. టెన్త్ మార్కుల ఆధారంగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో సీట్లు కేటాయించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు <
News March 13, 2026
మూసీ అభివృద్ధికి అదే స్ఫూర్తి: రేవంత్

TG: మూసీ పునరుద్ధరణ కోసం దుబాయ్, సింగపూర్, లండన్, సియోల్ వంటి నగరాల్లో పర్యటించి అక్కడి నదీ అభివృద్ధి నమూనాలను స్టడీ చేశామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఇతర దేశాల అభివృద్ధి వేగాన్ని అందుకోవడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. నిజాం కాలంలోనే చార్మినార్ చుట్టూ స్పెషల్ ఎకనమిక్ జోన్‌ను ఏర్పాటు చేసి నగరాన్ని అభివృద్ధి చేశారని, అదే స్ఫూర్తితో మూసీ తీరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.


