News July 10, 2024
కారుతో ఢీకొట్టి.. గర్ల్ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు

ముంబై హిట్ అండ్ రన్ <<13602763>>కేసులో<<>> మిహిర్ షా ప్రియురాలిని కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ‘ప్రమాదం తర్వాత నిందితుడు మిహిర్ తన గర్ల్ఫ్రెండ్కు 40సార్లు ఫోన్ చేశాడు. కారును కాలానగర్లో వదిలేసి, ఆటోలో ఆమె ఇంటికి వెళ్లి 2 గంటలున్నాడు. ఆ అమ్మాయి అతడి సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె వచ్చి మిహిర్ను తీసుకెళ్లింది. తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి రిసార్ట్కు వెళ్లారు’ అని జాతీయ మీడియా పేర్కొంది.
Similar News
News December 3, 2025
REWIND: రంగారెడ్డిలో 135 ఏకగ్రీవం.. రూపాయి రాలేదు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఫిబ్రవరి 2న పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించింది. ఏకగ్రీవ చిన్న పంచాయతీలకు రూ.10లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,185 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 135 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవీ కాలం ముగిసినా ఏకగ్రీవ పంచాయతీలకు ఇంకా పారితోషకం అందలేదు.
News December 3, 2025
GHMCలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం

TG: గ్రేటర్ హైదరాబాద్లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. ఇది నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ORR వరకు, దానికి అవతలి వైపు ఆనుకొని ఉన్న ప్రాంతాలను GHMCలో విలీనం చేయాలని ఇటీవల ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయించింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఈ విలీనం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది.
News December 3, 2025
మార్క్రమ్ సెంచరీ.. ఔట్ చేసిన హర్షిత్

భారత్ నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యం వైపు సాగుతున్న సౌతాఫ్రికాను హర్షిత్ రాణా దెబ్బ కొట్టారు. తొలి వన్డే ఆదిలోనే వికెట్లు తీసిన అతడు తాజాగా సెంచరీతో చెలరేగిన మార్క్రమ్ను వెనక్కి పంపారు. 110 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడిని పెవిలియన్ చేర్చారు. అంతకుముందు బవుమా 46, డీకాక్ 8 రన్స్ చేసి ఔట్ అయ్యారు. RSA 30 ఓవర్లలో 197/3 చేసింది. అర్ష్దీప్, ప్రసిద్ధ్, హర్షిత్ తలో వికెట్ తీశారు.


