News January 11, 2025
ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకే చంద్రబాబు ప్రోత్సాహం: పవన్ కళ్యాణ్

AP: సీఎం చంద్రబాబు ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే గ్రీన్ కో ప్రతినిధులు సరైన ప్రణాళికతో రాగానే అనుమతులు ఇచ్చారన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో విస్తరించిన పిన్నాపురం ప్రాజెక్టుకు 2,800 ఎకరాలు ఇవ్వగా కొంత భూమిపై రెవెన్యూ, అటవీ శాఖ మధ్య వివాదం వచ్చిందని పేర్కొన్నారు. దీన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని విన్నవించామని తెలిపారు.
Similar News
News October 21, 2025
ఒంబ్రొఫోబియా: వర్షం అంటే వణుకే!

కొందరికి వర్షం అంటే భయం. దాన్ని ఒంబ్రొఫోబియా అంటారు. పిల్లలు, టీనేజర్లకు ఈ ఫోబియా ఎక్కువగా ఉంటుంది. వీరు పదే పదే వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకుంటారు. వర్షం పడితే ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఇంటినుంచి బయటకు వెళ్లరు. వర్షం ఆగినా కొన్ని గంటల పాటు ఇంటికే పరిమితమవుతారు. గుండె దడ, వణుకు, భయం, ఛాతినొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫోబియాకు ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు.
News October 21, 2025
అతి భారీ వర్ష సూచన.. స్కూళ్లకు సెలవు

AP: అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రేపు ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA వెల్లడించింది. ఈ నేపథ్యంలో వర్షాలు పడే అవకాశమున్న మిగతా జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని పేరెంట్స్, స్టూడెంట్స్ కోరుతున్నారు.
News October 21, 2025
ఆయన భారత్‌ను ఎంచుకున్నారు.. లోకేశ్ ట్వీట్ వైరల్!

AP: వైజాగ్‌లో $15B పెట్టుబడులతో గూగుల్ డేటా-Ai హబ్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడులో అధికార DMK, ప్రతిపక్ష AIADMK మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గూగుల్‌ను TNకు తీసుకురావడంలో CM స్టాలిన్ ఫెయిలయ్యారని, తమిళుడైన గూగుల్ CEO పిచయ్ APని ఎంచుకున్నారని AIADMK చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ఆయన భారత్‌ను ఎంచుకున్నారు’ అంటూ హుందాగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.