News June 12, 2024

నా భర్త CM అని TVలో చూసే తెలుసుకున్నా: ప్రియాంక మాఝీ

image

తన భర్త సీఎం అయ్యేవరకూ తనకు తెలియదని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ భార్య ప్రియాంక మాఝీ తెలిపారు. టీవీలో చూసే తాను ఈ విషయం తెలుసుకున్నానని ఆమె చెప్పారు. ‘నా భర్త సీఎం అవుతారని ఊహించలేదు. మంత్రి పదవి దక్కుతుందని భావించాం. కానీ ఏకంగా ఆయన సీఎం అయ్యారు’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఒడిశా మూడో గిరిజన ముఖ్యమంత్రిగా మాఝీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Similar News

News November 24, 2025

పిల్లలకి ఘనాహారం ఎలా అలవాటు చెయ్యాలంటే?

image

చిన్నారులకు 6నెలలు దాటిన తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్‌ రాగి మాల్ట్, ఉగ్గు వంటివి స్టార్ట్ చెయ్యాలి. నెమ్మదిగా బ్రకోలీ, చిక్కుళ్లు, బీన్స్, బీరకాయ, క్యారెట్, బీట్‌రూట్ ఆవిరిపై ఉడికించి వారికి తినిపించాలి. అప్పుడే వారి శరీరం భిన్నరకాల ఆహారాలకు అలవాటవుతుంది. పోషకాలూ అందుతాయి. చాలామంది పేరెంట్స్ ఇడ్లీ, రసం, పెరుగన్నం త్వరగా తింటున్నారని అవే పెడతారు. దీంతో ఎదుగుదలలో ఇబ్బందులు వస్తాయంటున్నారు నిపుణులు.

News November 24, 2025

కీలక తీర్పుల్లో సూర్యకాంత్‌ ముద్ర

image

53వ CJIగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ సూర్యకాంత్‌ అనేక కీలక తీర్పుల్లో భాగస్వామ్యం అయ్యారు. జమ్మూకశ్మీర్‌ ఆర్టికల్‌ 370 రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం వంటి ప్రధాన అంశాలపై ఆయన సభ్యుడిగా ఉన్న ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు విశేషంగా నిలిచాయి. దేశద్రోహ చట్టాన్ని నిలిపివేసిన ధర్మాసనంలో కూడా సభ్యుడు. ఈ చట్టం కింద కొత్త FIRలు నమోదు చేయొద్దని ఆదేశించారు.

News November 24, 2025

రైతు ఫ్యామిలీలో పుట్టి.. CJIగా ఎదిగి..

image

CJI జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్ జిల్లాలో రైతు ఫ్యామిలీలో పుట్టారు. హిసార్ జిల్లా కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. పంజాబ్, హరియాణా హైకోర్టులో లాయర్‌‌గా కొనసాగారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. రాజ్యాంగపరమైన అంశాలు, ఎన్నికల సంస్కరణల వంటి కీలక కేసుల విచారణలో తనదైన ముద్ర వేశారు.