News January 1, 2025

మేం వచ్చాక అందరికీ భవిష్యత్తుపై భరోసా: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో చరిత్ర తిరగరాసిన సంవత్సరం 2024 అని సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘గత ఐదేళ్లు ప్రజలు, మీడియా, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చింది. రాజధాని అమరావతి నగరం ఫ్యూచర్‌లో అభివృద్ధి చెందుతుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News January 4, 2025

చంద్రబాబు గారూ ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా?: జగన్

image

AP: వరుసగా క్యాబినెట్ భేటీలు జరుగుతున్నా ‘తల్లికి వందనం’ ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పట్లేదని ప్రభుత్వాన్ని YS జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఎందరు పిల్లలుంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘ఈ ఏడాదికి తల్లికి వందనం ఇవ్వబోమని తేల్చిచెప్పేశారు. చంద్రబాబు గారూ ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా?’ అని ట్వీట్ చేశారు. రైతు భరోసా ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.

News January 4, 2025

5 ఎకరాల్లోపే రైతుభరోసా ఇవ్వాలని వినతి

image

TG: రైతుభరోసా పథకాన్ని 5 ఎకరాలలోపు రైతులకే అమలు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వాన్ని కోరింది. బీడు భూములకు, వందల ఎకరాలున్న వారికి పథకం అమలు చేస్తే ఖజానాపై భారం పడుతుందని పేర్కొంది. భూస్వాములు, IT చెల్లించే శ్రీమంతులను పథకానికి దూరం చేయాలని కోరింది. కౌలు రైతులను ఈ పథకంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ పథకం కోసం రేపటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి, జనవరి 14న నగదు జమ చేయనుంది.

News January 4, 2025

సినీ నటి సీత తల్లి కన్నుమూత

image

సీనియర్ నటి సీత తల్లి చంద్రమోహన్ (88) కన్నుమూశారు. చెన్నైలోని సాలిగ్రామంలోని తన స్వగృహంలో గుండె సంబంధిత సమస్యలతో ఆమె నిన్న తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ అసలు పేరు చంద్రావతి కాగా, పెళ్లయ్యాక ఆమె పేరును మార్చుకున్నారు. సీత పలు తెలుగు, తమిళ సినిమాలతో పాటు సీరియళ్లలో నటిస్తూ పాపులర్ అయ్యారు.