News October 12, 2024

ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు: పొన్నం

image

TG: కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట(D) హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల అంచనా కోసమే సర్వే చేపడుతున్నాం. 60 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమం చేపడతాం. కులగణనకు ప్రజలంతా సహకరించాలి’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Similar News

News October 12, 2024

ఈ విమాన ప్రయాణం ఒకటిన్నర నిమిషమే!

image

అత్యంత తక్కువ విమాన ప్రయాణ సమయమెంతో తెలుసా..? కేవలం ఒకటిన్నర నిమిషమే! స్కాట్లాండ్‌లోని ఓర్క్నీ దీవుల నుంచి పాపా వెస్ట్రే దీవుల మధ్య 1.7 మైళ్ల దూరం తిరిగే లోగన్‌ఎయిర్ విమానం ఆలోపే ప్రయాణికుల్ని గమ్యం చేరుస్తుంటుంది. ఈ రూట్‌లో స్టువర్ట్ లింక్‌లేటర్ అనే పైలట్ 53 సెకన్లలోనే ప్రయాణించి రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే ఈ ఫ్లైట్స్‌లో 10మంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది.

News October 12, 2024

పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొననున్న పవన్

image

ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్లెపండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మొత్తం 13,324 పంచాయతీల్లో రూ.4,500 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టనుంది. ఇంకుడు గుంతలు, పశువుల శాలలు, రోడ్లు ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

News October 12, 2024

HATSOFF: పొదల్లో పసిబిడ్డ.. దత్తత తీసుకున్న పోలీసు

image

అది యూపీలోని ఘజియాబాద్. పాపం ఇంకా కళ్లు కూడా తెరవని ఓ పసిగుడ్డును ఎవరో కఠినాత్ములు పొదల్లో వదిలేశారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ పుష్పేంద్ర సింగ్ అక్కడికి చేరుకున్నారు. ఆ బుజ్జాయిని చూసి చలించిపోయారు. పెళ్లై ఆరేళ్లైనా ఆయనకు పిల్లలు కలగలేదు. దీంతో దశమి రోజు దేవుడిచ్చిన వరంగా భావించి భార్యతో కలిసి ఆ చంటిదాన్ని దత్తత తీసుకున్నారు. ఆయన నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.