News March 22, 2024

అందుకోసం మూడేళ్లు పనిచేసినా సాధ్యం కాలేదు: యాపిల్

image

యాపిల్ వాచ్‌లు ఆండ్రాయిడ్‌తో పనిచేయవు. ఇది గుత్తాధిపత్యమే అంటూ ఓ సంస్థ USలో దావా వేసింది. ‘ఎవరైనా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారాలనుకుంటే, వారు తమ యాపిల్ వాచ్‌ను వదిలివేసి ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలి. ఇది యూజర్లపై విపరీతమైన భారాన్ని వేస్తోంది’ అని వాదించింది. అయితే ఆండ్రాయిడ్‌తోనూ పనిచేసేలా రూపొందించేందుకు తాము మూడేళ్లు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని యాపిల్ వెల్లడించింది.

Similar News

News October 2, 2024

ఈ ఏడాది వర్షాలతో ఎంతమంది చనిపోయారంటే..

image

ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తంగా భారీ వానలు కురిసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. ఈ వర్షాల కారణంగా 1492మంది కన్నుమూశారని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీరిలో 895మంది వరదల్లో, 597మంది పిడుగుపాటు వలన మరణించినట్లు పేర్కొంది. అత్యధికంగా కేరళలో 397మంది అసువులు బాసినట్లు వెల్లడించింది. ఇక ఈ ఏడాది వర్షపాతం గడచిన ఐదేళ్లలో అత్యధికమని IMD వివరించింది.

News October 2, 2024

మాతో ఘర్షణకు దిగొద్దు: ఇరాన్ అధ్యక్షుడు

image

తమ దేశ ప్రయోజనాలు, పౌరుల రక్షణ కోసమే ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు. ఈ దాడిని ఇజ్రాయెల్ దురాక్రమణకు ‘నిర్ణయాత్మక ప్రతిస్పందన’గా అభివర్ణించారు. ఇరాన్ యుద్ధభూమి కాదని, కానీ ఏదైనా ముప్పు ఉంటే దృఢమైన సంకల్పంతో దానికి వ్యతిరేకంగా నిలుస్తుందని అన్నారు. ఈ విషయం నెతన్యాహు తెలుసుకోవాలని, తమతో ఘర్షణకు దిగవద్దని ట్వీట్ చేశారు.

News October 2, 2024

రిషభ్ పంత్ సరదా మనిషి: లబుషేన్

image

టీమ్ ఇండియా ఆటగాళ్లందరిలోకీ భారత కీపర్ రిషభ్ పంత్ తనకు ఆసక్తికరంగా అనిపిస్తుంటారని ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అన్నారు. ‘పంత్ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటారు. కానీ నిజాయితీగా ఆడతారు’ అని పేర్కొన్నారు. ఇక బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో ఏదో విధంగా ఆటను ప్రభావితం చేసే జడేజాను చూస్తే తనకు చిరాకు, అసహనం వస్తుందని మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సరదాగా వ్యాఖ్యానించారు.