News October 14, 2025
పట్టుచీర కట్టిన తర్వాత..

ప్రతీ పండుగకు ఒక పట్టుచీర తీసి కడుతుంటారు మగువలు. అయితే వీటిని ప్రతిసారీ వాష్ చేస్తే పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. * కొత్త చీరలపై ఏవైనా మరకలు పడితే, ఆ ప్రాంతం వరకే శుభ్రం చేయ్యాలి. * చాలామంది కొత్త చీరలను డిటర్జెంట్, షాంపూలతో వాష్ చేస్తారు. అప్పుడు గాఢత తక్కువ ఉన్నవాటిని వాడాలి. * చీరలను కలిపి ఉతికేటపుడు వేటికవే విడిగా ఉతకాలి. లేదంటే రంగులు అంటుకోవచ్చు.
Similar News
News October 14, 2025
పశువుల్లో వ్యాధులు.. మందుల కొరతతో ఇబ్బందులు

AP: గత 2,3 వారాలుగా కురుస్తున్న వర్షాల వల్ల పాడిపశువులు, మేకలు, గొర్రెల్లో వ్యాధుల తీవ్రత పెరిగింది. గిట్టల మధ్య, మూతి దగ్గర పుండ్లు, గొంతువాపు లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటి నివారణకు ఇవ్వాల్సిన మందులు స్థానిక పశువైద్యశాలల్లో లేవని.. పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆరోపించింది. వాటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
News October 14, 2025
విశాఖలో మొట్టమొదటి గూగుల్ AI హబ్: సుందర్

డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటన చేశారు. ‘విశాఖపట్నంలో తొలి ఏఐ హబ్‌కు సంబంధించిన ప్రణాళికపై ప్రధాని మోదీతో మాట్లాడా. ఈ ఏఐ హబ్ కీలక మైలురాయి కానుంది. ఈ కేంద్రంలో గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఇంటర్నేషనల్ సబ్‌సీ గేట్‌వే & భారీ స్థాయి ఇంధన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. దీనిద్వారా AI ఆవిష్కరణలు వేగవంతం చేస్తాం.’ అని Xలో పేర్కొన్నారు.
News October 14, 2025
RSS సమావేశాలపై బ్యాన్‌కు కర్ణాటక CM ఆదేశం

RSS సమావేశాలను ప్రభుత్వ సంస్థలు, స్థలాల్లో నిషేధించేలా చర్యలకు CSను ఆదేశించినట్లు కర్ణాటక CM సిద్దరామయ్య తెలిపారు. TNలో మాదిరిగా రాష్ట్రంలోనూ చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖపై ఆయన స్పందించారు. కాగా RSS మతం పేరిట విద్యార్థుల మనసులను కలుషితం చేస్తోందని ఖర్గే ఆరోపించారు. BJP నేతల పిల్లలు అందులో ఎందుకు ఉండరని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థల్లో దాని సమావేశాలను అనుమతించబోమన్నారు.