News April 24, 2024
పరీక్షల్లో గెలిచి.. విధి చేతిలో ఓడాడు

AP: తూ.గో జిల్లా తిరుగుడుమెట్టకు చెందిన చంద్రశేఖర్ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రితో పాటు ప్రాణాలు కోల్పోయాడు. అయితే నిన్న విడుదలైన టెన్త్ ఫలితాల్లో చంద్రశేఖర్ 513 మార్కులు సాధించాడు. ఈ సంతోష సమయంలో మిత్రుడు తమతో లేకపోవడంతో స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి విద్యార్థిని కోల్పోయామంటూ ఉపాధ్యాయులు అతడిని గుర్తు చేసుకుంటున్నారు.
Similar News
News November 23, 2025
నేడు భారత్ బంద్

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.
News November 23, 2025
భారీగా పెరుగుతున్న రెవెన్యూ లోటు

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భారీగా పెరుగుతోంది. 2025-26లో రూ.33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేస్తే, OCT నాటికే రూ.47,805 కోట్లకు చేరినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. రెవెన్యూ ఆదాయం రూ.2.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తే రూ.91,638 కోట్లు వచ్చాయి. ప్రస్తుత FYలో రూ.79,927 కోట్ల అప్పులు చేయాల్సి ఉండగా, 7 నెలల్లోనే రూ.67,283 కోట్ల రుణాలు తీసుకుంది.
News November 23, 2025
PNBలో 750 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్డేట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. 20-30 ఏళ్ల మధ్య ఉన్న గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తారు. https://pnb.bank.in/


