News February 10, 2025
అగాఖాన్ అంత్యక్రియలు పూర్తి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739147601230_653-normal-WIFI.webp)
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇస్మాయిలీ ముస్లింల 49వ ఇమామ్ అగాఖాన్(88) అంత్యక్రియలు ముగిశాయి. ఈనెల 5న మరణించిన ఆయనను ఈజిప్ట్‌లోని అస్వాన్‌లో నిన్న రాత్రి ఖననం చేశారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఆయన 1967లో అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌ను స్థాపించారు. దీని ద్వారా వందలాది ఆసుపత్రులు, పాఠశాలలు, పేదలకు ఇళ్లు నిర్మించారు. ఆయన సేవలకుగానూ 2015లో కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
Similar News
News February 10, 2025
చైనా సంక్షోభం: పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరుగుతున్నాయ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739195399793_695-normal-WIFI.webp)
చైనాలో పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరగడం ఆందోళనకరంగా మారింది. 2024లో 61L వివాహాలు నమోదయ్యాయి. 1986 తర్వాత ఇదే అత్యల్పం. 2023తో పోలిస్తే 20.5% తగ్గడం గమనార్హం. ఇక గత ఏడాది 26L జంటలు డివోర్స్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 28K అధికం. అలాగే ఆ దేశంలో శ్రామిక జనాభా(16-59yrs) 68L తగ్గిందని ఓ నివేదికలో వెల్లడైంది. మొత్తం జనాభాలో 60ఏళ్లకు పైగా వయసున్న వారు 22 శాతానికి పెరిగారని తేలింది.
News February 10, 2025
టీచర్ ఉద్యోగ నియామకాల ఆలస్యం.. హైకోర్టు ఆగ్రహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1732018822759_81-normal-WIFI.webp)
TG: DSC-2008 నియామకాల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 1,382 మందిని ఇవాళ్టిలోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని <<15354548>>ఆదేశించినా<<>> అమలు చేయకపోవడంతో విద్యాశాఖపై మండిపడింది. కోర్టు ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాదిని హెచ్చరించింది. మూడు రోజుల్లోగా ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖ కమిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 17కు వాయిదా వేసింది.
News February 10, 2025
20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్: చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739196034426_81-normal-WIFI.webp)
AP: PM సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు CM చంద్రబాబు వెల్లడించారు. 2కిలోవాట్ల వరకు SC, STలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని చెప్పారు. ఈ పథకం అమల్లో బ్యాంకులూ భాగస్వామ్యం కావాలని బ్యాంకర్లతో భేటీలో CM కోరారు. ఈ పథకంతో అవసరాలకు ఉచితంగా విద్యుత్ పొందడమే కాకుండా, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో ప్రజలు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.