News June 20, 2024

మళ్లీ YS జగన్ ఓదార్పు యాత్ర!

image

AP: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని, వైసీపీ ఓటమి కారణంగా మృతిచెందిన వారిని పరామర్శించనున్నారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి ఆయన మళ్లీ ఓదార్పు యాత్ర చేయనున్నారని సమాచారం. ఈ మేరకు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Similar News

News October 27, 2025

భారీ వర్షాలు.. చామంతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

అధిక వర్షాల వల్ల చామంతిలో వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగులు ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. పంటలో నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపాలి. వేరుకుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా విడోమిల్ ఎంజడ్ 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. అలాగే ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి కార్బండిజమ్ ఒక గ్రాము మరియు మ్యాంకోజబ్ 2.5 గ్రా. లేదా లీటరు నీటికి హెక్సాకోనోజోల్ 2ml కలిపి పిచికారీ చేయాలి.

News October 27, 2025

డౌన్ సిండ్రోమ్ లక్షణాలివే..

image

డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు కనిపిస్తాయి. మెడ వెనక భాగంలో దళసరిగా ఉండటం, చెవి డొప్పలు చిన్నగా ఉండటం, చప్పిడి ముక్కు, ఎత్తు పెరగకపోవడం, తల చిన్నగా ఉండటం, మానసిక వికాసం ఆలస్యంగా ఉండటంతో పాటు గుండె, కంటి సమస్యలు, హైపోథైరాయిడిజం వంటివీ ఉంటాయి. ఇది క్రోమోజోముల తేడా వల్ల వచ్చిన కండిషన్‌ కావడంతో దీనికి చికిత్స లేదు. కానీ నిపుణుల పర్యవేక్షణలో థెరపీలు తీసుకుంటుంటే కాస్త ఫలితం కనిపిస్తుంది.

News October 27, 2025

ఆలస్యంగా ప్రెగ్నెంట్ అయితే..

image

మహిళల్లో గర్భధారణ ఆలస్యమైతే పిల్లల్లో ‘డౌన్స్ సిండ్రోమ్ రిస్క్’ పెరుగుతుంది. 25ఏళ్ల వయసులో ప్రెగ్నెంటయితే 1250 మందిలో ఒకరికి, 30ఏళ్లలో 1000 మందిలో ఒకరికి, 35ఏళ్లలో 400 మందిలో ఒకరికి, 40ఏళ్లలో 100 మందిలో ఒకరికి, 45ఏళ్లలో 30 మందిలో ఒకరికి రిస్క్ ఉంటుంది. పిల్లల్లో శారీరక, మానసిక లోపాలుంటాయి. దీన్ని గుర్తించడానికి ట్రిపుల్ స్క్రీన్ పరీక్ష చేయించాలి. #ShareIt
* ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.