News August 19, 2025
జట్టు ఎంపికపై స్పందించిన అగార్కర్

ఆసియా కప్‌కు భారత జట్టు ఎంపిక కఠినంగా సాగిందని చీఫ్ సెలక్టర్ అగార్కర్ తెలిపారు. ‘అంచనాలు అందుకోవడంతోనే గిల్‌ను ఎంపిక చేశాం. అభిషేక్‌తో కలిసి గిల్, శాంసన్‌లో ఎవరూ ఓపెనింగ్ చేస్తారనేది ఇంకా డిసైడ్ చేయలేదు. శ్రేయస్ తప్పేం లేదు. అభిషేక్ బౌలింగ్ కూడా చేయగలడు. అందుకే జైస్వాల్‌ను కాదని అతడిని తీసుకున్నాం. కానీ జట్టులో 15 మందికే చోటు ఇవ్వగలం. 2026 T20 WCకి ఈ జట్టే ఫైనల్ కాదు’ అని చెప్పారు.
Similar News
News August 19, 2025
ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

HYDలో ప్రియుడితో కలిసి భర్తను భార్య హతమార్చింది. అల్లాపూర్ రాజీవ్‌గాంధీ నగర్‌లో షాదుల్-తబ్‌సుమ్ దంపతులు నివాసముంటున్నారు. 4ఏళ్ల క్రితం తబ్‌సుమ్‌కు తాఫిక్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి భర్త మందలించాడు. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని AUG 15న షాదుల్ పడుకున్నప్పుడు ఇద్దరూ కలిసి కొట్టి, దిండుతో ముక్కు, నోరు మూసి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.
News August 19, 2025
అత్యంత ఖరీదైన గణేశుడి విగ్రహం ఇదే!

మరికొన్ని రోజుల్లో వినాయక చవితి. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గణేశుడి విగ్రహం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ గణపతి విగ్రహం సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేశ్ భాయ్ పాండవ్ దగ్గర ఉంది. 2005లో కాంగోలో లభించిన అన్‌కట్ డైమండ్‌ను ఆయన రూ.29,000తో వేలంలో కొనుగోలు చేశారు. అయితే సహజసిద్ధంగా గణేశుడి ఆకృతి, నాణ్యత కారణంగా ఈ వజ్రం విలువ ఇప్పుడు ₹500 కోట్లకు చేరింది.
News August 19, 2025
హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్

TG: ‘కాళేశ్వరం’ విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదికను నిలిపేయాలని కోరుతూ మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి రెండు పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్లు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.