News November 15, 2024
కార్యసాధకుడికి వయసు అడ్డు కాదు

ఎదిగేందుకు, లక్ష్యాలను సాధించేందుకు వయసు అన్న పదం అడ్డు కాకూడదు. ఇంకే చేయగలంలే అంటూ డీలా పడకూడదు. KFCని శాండర్స్ తన 62వ ఏట మొదలుపెట్టారు. పోర్షేను ఫెర్డినాండ్ 56వ ఏట, స్టార్ బక్స్ను గోర్డన్ తన 51వ ఏట, వాల్మార్ట్ను శామ్ వాల్టన్ 44వ ఏట, కోకాకోలాను ఆసా కాండ్లర్ 41వ ఏట ప్రారంభించారు. సాధించాలన్న తపన, సాధించగలమన్న నమ్మకమే వీరిని విజయతీరాలకు చేర్చాయి.
Similar News
News December 6, 2025
NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్చైన్ డెవలప్మెంట్లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: nccd.gov.in.
News December 6, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.540 తగ్గి రూ.1,30,150కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.500 పతనమై రూ.1,19,300పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,95,900గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 6, 2025
వెస్టిండీస్ వీరోచిత పోరాటం..

న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ అసాధారణ రీతిలో ఆడుతోంది. రికార్డు స్థాయిలో 531 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వీరోచిత పోరాటం చేస్తోంది. జస్టిన్ గ్రీవ్స్(181*), కీమర్ రోచ్ (53*) కలిసి 7వ వికెట్కు ఏకంగా 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. షాయ్ హోప్ 140 పరుగులు చేసి ఔట్ అయ్యారు. చేతిలో మరో 4 వికెట్లు ఉన్నాయి. 17 ఓవర్లలో 98 పరుగులు చేయాల్సి ఉంది. మరి లక్ష్యాన్ని WI అందుకుంటుందా?


