News June 11, 2024
డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు

TG: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో జరిగే ప్రమాదాల్లో కార్మికుడు దివ్యాంగుడైనా, మరణించినా కారుణ్య నియామకాల్లో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు. కాగా డిపెండెంట్ ఉద్యోగాల వయసు పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరింది.
Similar News
News January 17, 2026
మద్యం అమ్మకాల్లో వృద్ధి

TG: 2025 DEC నాటికి మద్యం అమ్మకాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ల ఆదాయంలో రాష్ట్రం గణనీయ వృద్ధిని సాధించింది. ఆస్తి పన్ను వార్షిక లక్ష్యం ₹19,087CR కాగా 59.22% (₹11,304CR) సాధించినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. 2024లో ఇది కేవలం 41.28% మాత్రమే. ఎక్సైజ్ ఆదాయం ₹27,263 CR లక్ష్యంలో 63.38% (₹17,507CR) సాధించింది. 2024లో ఇది 54.96%. ఇక అమ్మకపు పన్ను 2024లో DEC నాటికి 71% సాధించగా ఈసారి అది 67.07%కి తగ్గింది.
News January 17, 2026
జపాన్ వెకేషన్లో అల్లు అర్జున్.. ఫ్యామిలీ పిక్ వైరల్

టోక్యోలోని సెన్సో-జి ఆలయానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హతో దిగిన ఫోటోను SMలో ఆయన షేర్ చేశారు. షేర్ చేసిన క్షణాల్లోనే ఈ పిక్ను అభిమానులు వైరల్ చేసేశారు. సినిమాలు, ఫ్యామిలీకి సమానంగా టైమ్ కేటాయిస్తూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్నారని కామెంట్స్ పెడుతున్నారు.
News January 17, 2026
తక్కువ అర్హత పోస్టులకు వారిని మినహాయించొచ్చు: SC

ఎక్కువ అర్హతల వారిని తక్కువ అర్హత పోస్టుల నుంచి మినహాయించొచ్చని SC కీలక తీర్పిచ్చింది. బిహార్ GOVT ఫార్మసిస్ట్ రిక్రూట్మెంటులో డిప్లొమా ఫార్మసీని అర్హతగా నిర్ణయించింది. దీనిపై B.ఫార్మా, M.ఫార్మా అభ్యర్థులు HCకి వెళ్లారు. డిప్లొమా వారితో పోలిస్తే వీరికి ప్రాక్టికల్స్ తక్కువన్న GOVT వాదనతో HC ఏకీభవించి పిిటిషన్ను కొట్టేసింది. అర్హతలపై తుదినిర్ణయం GOVTదేనంది. SC దీన్నే సమర్థించి తాజా తీర్పిచ్చింది.


