News March 24, 2025
రోహిత్‌కు ఆరంభంలోనే దూకుడు పనికిరాదు: వాట్సన్

రోహిత్ శర్మ ఐపీఎల్లో కొంచెం ఆచితూచి ఆడాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డారు. ‘పిచ్‌పై ఓ ఐడియా వచ్చేవరకూ కనీసం 6 బంతుల పాటు రోహిత్ టైమ్ తీసుకోవాలి. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటం అంత సులువు కాదు. చెన్నైతో మ్యాచ్‌లో పిచ్ నెమ్మదిగా ఉంది. అయినా షాట్ ఆడేందుకు యత్నించి ఆయన ఔట్ అయ్యారు. అన్ని సమయాల్లోనూ దూకుడు పనికిరాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 14, 2025
గెలిస్తేనే మాస్క్ తీస్తానని.. ఓడిపోయింది

బిహార్ ఎన్నికల్లో గెలిస్తేనే మాస్క్ తీస్తానని శపథం చేసిన ప్లూరల్స్ పార్టీ చీఫ్ పుష్పమ్ ప్రియాచౌదరి ఓడిపోయారు. దర్భంగా నుంచి పోటీ చేసిన ఆమె 8వ స్థానంతో సరిపెట్టుకున్నారు. BJP అభ్యర్థి సంజయ్ సరోగినే ఈసారి కూడా విజయం సాధించారు. బిహార్‌కు కొత్త బ్రాండ్ తీసుకొస్తానంటూ 2020లో ప్రియ ‘ది ప్లూరల్స్ పార్టీ’ స్థాపించారు. 2020లో 148 స్థానాల్లో పోటీచేసి ఓడిపోయారు. ఈసారి 243 స్థానాల్లో బరిలోకి దిగారు.
News November 14, 2025
‘క్రెడిట్’ రాజకీయం.. BRS ఓటమికి కీలక కారణం?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బాధ్యత KTRకు అప్పగించడం కొంతమంది ముఖ్య నేతలకు మింగుడు పడలేదని టాక్. గెలిస్తే ఆయనకు క్రెడిట్ దక్కుతుందని దూరంగా ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ MLAలు ఆయనతో కలిసి రాలేదని కొంతమంది శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అటు హరీశ్ రావు తన తండ్రి మరణంతో ఏమీ చేయలేకపోయారు. ఇక కిందిస్థాయి కేడర్‌ను కవిత కంట్రోల్ చేసినట్లు తెలుస్తోంది. అంతాకలిసి అంటీముట్టనట్టుగా వ్యవహరించారు.
News November 14, 2025
RITESలో 252 పోస్టులకు నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(<


