News April 3, 2024
ఘాతుకం.. రైలు నుంచి టీటీఈని తోసేశాడు

కేరళలో కదులుతున్న రైలులో నుంచి టీటీఈని తోసేసి ప్రాణాలు తీశాడో వ్యక్తి. ఎర్నాకుళం నుంచి పట్నా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న సదరు వ్యక్తిని టీటీఈ ప్రశ్నించారు. ఈ క్రమంలో టీటీఈని అతను తోసేయడంతో అవతలి పట్టాలపై పడ్డారని, అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీకొని ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పాలక్కాడ్ వద్ద నిందితుడు వినోద్‌ని పట్టుకున్నారు.
Similar News
News October 24, 2025
నల్గొండ: 154 వైన్ షాపులకు 4,905 దరఖాస్తులు

నల్గొండ జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని 154 వైన్ షాపుల కోసం మొత్తం 4,905 టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో నల్గొండ డివిజన్లో అత్యధికంగా 1,417, మిర్యాలగూడలో 988, దేవరకొండలో 621, హాలియాలో 509, నకిరేకల్‌లో 512, చండూరులో 398 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
News October 24, 2025
అక్టోబర్ 24: చరిత్రలో ఈరోజు

1930: నిర్మాత చవ్వా చంద్రశేఖర్ రెడ్డి జననం
1966: నటి నదియా జననం
1980: నటి లైలా జననం
1985: బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త లాస్లో బైరో మరణం
2015: హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు మరణం
2017: దక్షిణ భారత సినిమా దర్శకుడు ఐ.వి.శశి మరణం
✿ఐక్యరాజ్య సమితి దినోత్సవం
✿ప్రపంచ పోలియో దినోత్సవం
News October 24, 2025
WWC 2025: సెమీస్ చేరిన జట్లివే..

మహిళల వన్డే వరల్డ్ కప్(WWC) 2025లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. NZతో మ్యాచులో విజయంతో టీమ్ఇండియా సెమీస్ చేరింది. అంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. సెమీఫైనల్‌కు ముందు ఈ జట్లు తలో మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నెల 26న బంగ్లాతో మ్యాచులో భారత్ గెలిచినా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోనే ఉండనుంది. అటు మిగతా 3 జట్ల ప్రదర్శన టాప్-3 స్థానాలను ఖరారు చేయనుంది.