News June 23, 2024
ఇళ్ల స్థలాల కోసం ఆందోళన.. మియాపూర్‌లో 144 సెక్షన్

HYD శివారులోని మియాపూర్, చందానగర్‌లో ఈనెల 29 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. మదీనాగూడ సర్వే నం.100, 101లో ఉన్న HMDA భూముల ఆక్రమణకు నిన్న పలువురు యత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ స్థలాల్లో తమకు ఇళ్లు/పట్టాలు ఇవ్వాలంటూ ఆక్రమణదారులు డిమాండ్ చేస్తుండగా, చట్ట విరుద్ధంగా స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News February 1, 2026
ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ముగిసింది. మొత్తం 4 గంటల 50 నిమిషాల పాటు సిట్ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. తాము సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి విచారణ చేసినట్లు సమాచారం. మొత్తం ఆరుగురు అధికారుల బృందం కేసీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం వాళ్లు నందినగర్‌లోని ఆయన నివాసం నుంచి వెళ్లిపోయారు.
News February 1, 2026
మీకు తెలుసా! కోయడం బట్టే ఉల్లిపాయ టేస్ట్..

కోసే విధానాన్ని బట్టి ఉల్లిపాయ రుచి మారుతుందని మీకు తెలుసా? ఉల్లిపాయను నిలువు(తల నుంచి వేళ్ల వైపు)గా కోస్తే కణాలు తక్కువగా దెబ్బతిని తీపి రుచి వస్తుంది. నాన్‌వెజ్ కర్రీస్ వండేటప్పుడు ఇవి త్వరగా మెత్తబడి గ్రేవీకి చిక్కదనాన్ని ఇస్తాయి. అడ్డంగా కోస్తే కణాలు విచ్ఛిన్నమై ఘాటు పెరుగుతుంది. సలాడ్ల కోసం ఇవి బెటర్. అయితే అడ్డంగా కోసినప్పుడు ఎంజైమ్స్ ఎక్కువగా విడుదలై కళ్ల నుంచి నీళ్లు అధికంగా వస్తాయి.
News February 1, 2026
పెళ్లైన 60 రోజులకే భర్తను గొంతు కోసి చంపిన భార్య

UP బరేలీలో పెళ్లైన 2 నెలలకే భార్య తన భర్తను చంపేసింది. 9 ఏళ్లు ప్రేమించుకున్న జితేంద్ర, జ్యోతి గతేడాది NOVలో పెళ్లి చేసుకున్నారు. జితేంద్ర ఆన్లైన్ జూదానికి బానిసై, భార్య ఖాతా నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. దీనిపై వివాదం చెలరేగగా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె భర్త గొంతు కోసి చంపేసింది. మృతదేహాన్ని కిటికీకి వేలాడదీసి సూసైడ్‌గా చిత్రీకరించింది. పోస్టుమార్టం నివేదికలో నిజం తేలడంతో వారిని అరెస్ట్ చేశారు.


