News July 7, 2024
‘అగ్నిపథ్’ వయోపరిమితి పెంపు?

‘అగ్నిపథ్’ వయోపరిమితి పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల తర్వాత కనీసం 50 శాతం మందిని సైన్యంలోనే కొనసాగించాలని కూడా కోరే అవకాశం ఉంది. 21 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని 23కు పెంచాలని ప్రతిపాదించనున్నారట. దీంతో సైన్యంలోని ఉద్యోగాలను డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పొందే అవకాశం ఉంది. 50 శాతం మంది అగ్నివీరుల సర్వీస్ కొనసాగించడం వల్ల సిబ్బంది కొరతను అధిగమించవచ్చు.
Similar News
News January 5, 2026
శివ మానస పూజలో చదవాల్సిన మంత్రాలు

‘శివ మానస పూజ స్తోత్రం’ దీనికి ప్రధాన మంత్రం. ఇది ‘రత్నైః కల్పితమాసనం’ అని మొదలవుతుంది. ఈ స్తోత్రం చదవడం వీలుకాకపోతే కేవలం ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపిస్తూ పూజ చేయవచ్చు. లేదా ‘శివోహం శివోహం’ అని స్మరించవచ్చు. చివరగా ‘ఆత్మా త్వం గిరిజా మతిః’ అనే శ్లోకాన్ని పఠించినా విశేష ఫలితాలుంటాయి. ఈ పూజలో మన ప్రతి కర్మను శివుడికి అర్పించాలి. శివ మానస పూజను ఎవరైనా, ఎప్పుడైనా ఆచరించవచ్చు.
News January 5, 2026
వరి నాట్లు.. ఇలా చేస్తే అధిక ప్రయోజనం

వరి రకాల పంట కాలాన్ని బట్టి 22-28 రోజుల వయసుగల నారును నాట్లు వేసుకోవాలి. వరి నారు కొనలను తుంచి నాటితే కాండం తొలుచు పురుగు, ఇతర పురుగుల గుడ్లను నాశనం చేయవచ్చు. నాట్లు పైపైనే 3సెంటీమీటర్ల లోతులోనే నాటితే పిలకలు ఎక్కువగా వస్తాయి. నాటేటప్పుడు పొలంలో ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెం.మీ కాలిబాటలు వదలాలి. కాలిబాటలు తూర్పు పడమర దిశగా ఉంచాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా అంది చీడల సమస్య తగ్గుతుంది.
News January 5, 2026
బ్యాలెట్ పేపర్‌తోనే మున్సిపల్ ఎలక్షన్స్

TG: మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. అంతకుముందు 2014లో EVMలు, 2020లో కరోనా కారణంగా బ్యాలెట్‌తో నిర్వహించారు. ఈసారి EVMలతో నిర్వహించే అవకాశమున్నా బ్యాలెట్ వైపే మొగ్గుచూపారు. మరో వారం, 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా రానుంది.


