News July 29, 2024
అగ్నిపథ్: రాహుల్ X రాజ్‌నాథ్

అగ్నిపథ్‌పై రాహుల్, రాజ్‌నాథ్ మధ్య సంవాదం జరిగింది. పింఛన్ల గురించి ప్రస్తావిస్తూ ఈ పథకం జవాన్లు, వారి కుటుంబాల ఆర్థిక రక్షణ, గౌరవాన్ని లాగేసుకుందని రాహుల్ ఆరోపించారు. ఇది యువతపై ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందన్నారు. ప్రతిపక్ష నేత బడ్జెట్‌పై అపోహలు సృష్టిస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. అగ్నిపథ్‌పై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదన్నారు.
Similar News
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


