News June 17, 2024

అగ్నిపథ్ రీ-లాంచ్.. PIB FactCheck రిప్లై ఇదే

image

అగ్నిపథ్ పథకం రీ-లాంచ్ పేరుతో వాట్సాప్‌లో వైరల్ అవుతున్న సందేశం ఫేక్ అని PIB ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. పథకం మార్పునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పేర్కొంది. కాగా అగ్నిపథ్‌ పేరును ‘సైనిక్ సమాన్ స్కీమ్’గా మార్చడంతో పాటు డ్యూటీ పీరియడ్, పర్మినెంట్ శాతం, ఆదాయం పెంపు అంటూ ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.

Similar News

News March 5, 2026

మహిళలకు ఉచితంగా హెల్త్ చెకప్‌లు

image

TG: రాష్ట్రంలోని 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఫ్రీగా హెల్త్ చెకప్‌లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 8న మహిళా దినోత్సవం రోజు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తెలిపారు. టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా ఒక్కొక్కరికి 30 రకాల పరీక్షలు చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేస్తారు. అన్ని రకాల రిపోర్టులతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తారు.

News March 5, 2026

మాయిస్ట్ హీట్‌తో ఈ సమ్మర్ వెరీ హాట్!

image

గాలిలో ఉష్ణోగ్రతతో పాటు తేమ ఎక్కువగా ఉంటే ‘మాయిస్ట్ హీట్’ అంటారు. ఈ సమ్మర్‌లో ఇది ఎక్కువ రోజులు ఉండనుంది. ‘సాధారణంగా ఎండలకు పట్టిన చెమట గాలికి ఆవిరై శరీరం చల్లబడుతుంది. మాయిస్ట్ హీట్‌తో గాలిలో తేమ ఉండటం వల్ల చెమట ఆవిరి కాదు. అయినా శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. దీంతో దాహం వేయకపోయినా నీరు తాగాలి’ అని నిపుణులు సూచిస్తున్నారు. గాలిలో తేమ 60%, టెంపరేచర్ 30°C ఉంటే అది మనకు 40°C మాదిరి అనిపిస్తుంది.

News March 5, 2026

421 పోస్టులు.. దరఖాస్తుకు 3 రోజులే అవకాశం

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 421 పోస్టులకు అప్లై చేయడానికి 3రోజులే(మార్చి 8) అవకాశం ఉంది. పోస్టును బట్టి డిగ్రీ, MBA/PGDM, CA/CFA/CMA అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్క్రూట్నీ, ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/