News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <
Similar News
News July 7, 2025
తెలంగాణలో ‘జాగీర్’ ఫైట్!

‘తెలంగాణ BRS జాగీరా?’ అని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ కోసం పోరాడింది BRS అని, తెలంగాణ తమ జాగీరే అని ఆ పార్టీ నేతలు పోస్టులు చేస్తున్నారు. ఆంధ్ర పత్రికలు మరోసారి విషం చిమ్ముతున్నాయని ఫైరవుతున్నారు. అయితే BRSని విమర్శిస్తే తెలంగాణను తిట్టినట్లు కాదని కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. మళ్లీ సెంటిమెంటును రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News July 7, 2025
బ్యాటింగ్, బౌలింగ్ అదరగొట్టారుగా..

రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై గెలుపుతో గిల్ కెప్టెన్‌గా విజయాల ఖాతా తెరిచారు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత జట్టుకు ఇదే తొలి విజయం. ఈ మైదానంలో ఆడిన గత 8 మ్యాచుల్లో ఏడు ఓడిపోగా ఒక మ్యాచును డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్, రెండో ఇన్నింగ్సులో ఆకాశ్ దీప్ ఆరేసి వికెట్లతో అదరగొట్టారు. అటు కెప్టెన్ గిల్ 430 పరుగులతో మరిచిపోలేని ప్రదర్శన చేశారు. జడేజా, పంత్, జైస్వాల్, రాహుల్ తమ వంతు పాత్ర పోషించారు.
News July 7, 2025
రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

రేపు APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మరోవైపు TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగాం, RR, HYD, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.