News August 22, 2024

26 నుంచి విశాఖలో ‘అగ్నివీర్’ ర్యాలీ

image

AP: ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 5 వరకు విశాఖ పోర్టు స్టేడియంలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన యువత పాల్గొనవచ్చు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ పోస్టులకు టెన్త్, ట్రేడ్స్‌మెన్ పోస్టులకు 8వ తరగతి చదివినవారు అర్హులు.

Similar News

News November 25, 2025

టెంపుల్ కారిడార్ నిర్మాణానికి రూ.380 కోట్లు: TPCC ఛీఫ్

image

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, లింబాద్రిగుట్ట, బాసరను కలుపుతూ టెంపుల్ కారిడార్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.380 కోట్లు మంజూరు చేసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ధర్మపురిలో ప్రారంభమై కొండగట్టు, వేములవాడ, భీమ్‌గల్ మీదుగా బాసర వరకు ఈ కారిడార్ నిర్మిస్తారని ఆయన ప్రకటించారు.

News November 25, 2025

పిల్లలు నూడుల్స్, పాస్తా తింటే కలిగే నష్టాలు తెలుసా?

image

రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారు చేసే నూడుల్స్, పాస్తా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక సోడియంతో పిల్లల్లో బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడంతో ఒబెసిటీ, పోషకాహార లోపం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

News November 25, 2025

జుబీన్ గార్గ్‌ను హత్య చేశారు: సీఎం హిమంత

image

ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం CM హిమంత బిశ్వశర్మ సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రమాదవశాత్తు చనిపోలేదని, హత్యకు గురయ్యారని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. 52 ఏళ్ల జుబీన్ ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తు మరణించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై తొలి నుంచీ ఆయన కుటుంబం అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. ఈక్రమంలోనే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.