News December 15, 2025

‘AGRATE’ ఏం చేస్తుంది?

image

‘AGRATE’ చిన్న రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సేంద్రియ ఎరువులను తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే కొమ్మలను అంటుకట్టడం, ఎక్కువ పంటల సాగు, స్థిరమైన వ్యవసాయ విధానాలపై రైతులకు ఆధునిక శిక్షణ ఇవ్వడంతో పంట దిగుబడి పెరిగింది. ITC, Godrej, Parle వంటి కంపెనీలతో శుక్లా ఒప్పందం చేసుకోవడంతో రైతుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరిగి వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.

Similar News

News December 21, 2025

VB-G RAM G బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

image

VB-G RAM G బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో జీవించే పేదలకు 125 రోజుల పనిదినాలను ఈ పథకం కింద అందిస్తారు. ఫారెస్ట్ ఏరియాల్లో జీవించే షెడ్యూల్ ట్రైబల్ కమ్యూనిటీలకు 150పనిదినాలు కల్పించేలా చట్టంలో NDA ప్రభుత్వం మార్పులు చేసింది. UPA హయాంలో 100రోజుల కనీస పనిదినాల లక్ష్యంతో తీసుకొచ్చిన MGNREGA పథకాన్ని కేంద్రం ఇటీవల రద్దు చేయడం తెలిసిందే.

News December 21, 2025

పోలీసులకు ఒక్క రోజులోనే రుణాలు!

image

AP: పోలీసు సిబ్బంది సంక్షేమానికి కీలక ముందడుగు పడింది. సంక్షేమ రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌గా మారుస్తూ ఏపీ DGP హరీశ్‌కుమార్ గుప్తా ‘APOLIS’ ఆటోమేటెడ్ లోన్ సిస్టమ్‌ను ప్రారంభించారు. గతంలో 3 నెలలు సమయం పట్టే రుణ మంజూరు ఇకపై కేవలం ఒక్క రోజులోనే పూర్తవుతుంది. లోన్లు, సెలవులు, పేస్లిప్స్ వంటి వివరాలు ‘APOLIS’ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని డీజీపీ తెలిపారు.

News December 21, 2025

ఇతిహాసాలు క్విజ్ – 103 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: ఇతనికి తల, మెడ ఉండవు. కడుపు భాగంలోనే నోరు ఉంటుంది. చేతులు మాత్రం మైళ్ల దూరం వరకు సాగుతాయి. ఎవరతను?
సమాధానం: రామాయణంలోని అరణ్యకాండలో ఈ వింతైన పాత్ర కనిపిస్తుంది. అతని పేరు ‘కబంధుడు’. ఓ శాపం వల్ల ఈ రూపం పొందుతాడు. రాముడు ఇతని బాహువులను ఖండించడంతో శాపవిమోచనం కలిగి, తిరిగి గంధర్వ రూపాన్ని పొందుతాడు. సుగ్రీవుడితో స్నేహం చేయమని రాముడికి సలహా ఇస్తాడు. <<-se>>#Ithihasaluquiz<<>>