News January 21, 2025
తెలంగాణలో రాకెట్ తయారీకి ఒప్పందం

తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు HYDకు చెందిన స్కైరూట్ కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ దావోస్లో ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. HYDకు చెందిన ఈ సంస్థ అత్యాధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించడం గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే HYDను ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు.
Similar News
News November 14, 2025
స్థానిక ఎన్నికలపై 17న నిర్ణయం: CM రేవంత్

TG: ఈ నెల 17న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి, స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. క్యాబినెట్ భేటీలో మంత్రులందరితో ఈ అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. కాగా జూబ్లీహిల్స్ గెలుపుతో స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సీఎం వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఈ నెల 17న లోకల్ బాడీ ఎన్నికలపై క్లారిటీ రానుంది.
News November 14, 2025
కేసీఆర్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది: రేవంత్

TG: కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని, ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రెస్మీట్లో మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ను విమర్శించడం భావ్యం కాదు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక స్పందిస్తా. ఆయన కుర్చీ గుంజుకోవడానికి కేటీఆర్, హరీశ్ ప్రయత్నిస్తున్నారు. వారి పరిస్థితి ఏంటో చూద్దామని జూబ్లీహిల్స్లో నిరూపించుకోవాలని వదిలేశారు’ అని వ్యాఖ్యానించారు.
News November 14, 2025
హరీశ్కు అసూయ, కేటీఆర్కు అహంకారం తగ్గలేదు: రేవంత్

TG: అధికారం పోయినా హరీశ్ రావుకు అసూయ, KTRకు అహంకారం తగ్గలేదని CM రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘వారిద్దరు అసూయ, అహంకారం తగ్గించుకోవాలి. అసెంబ్లీలో రక్తమంతా మొహంలోకి తెచ్చుకుని హరీశ్ చూస్తుంటాడు. ఆ చూపులకు శక్తి ఉంటే మాడి మసైపోతాం’ అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, వారసత్వ సంపద కాదని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు చేయాలని అన్నారు. సమస్యలపై ధర్నాలు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు.


