News August 25, 2025
డ్రీమ్-11తో ఒప్పందం రద్దైంది: BCCI కార్యదర్శి

డ్రీమ్11తో స్పాన్సర్షిప్ ఒప్పందం రద్దు చేసుకున్నట్లు BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ చట్టం అమలులోకి వచ్చాక డ్రీమ్11తో ఒప్పందం రద్దు చేసుకున్నాం. ఇకపై భవిష్యత్తులో అలాంటి సంస్థలతో బీసీసీఐ ఎలాంటి ఒప్పందాలు చేసుకోదు’ అని స్పష్టం చేశారు. దీంతో ఆసియాకప్‌లో టీమ్‌ఇండియా మెయిన్ స్పాన్సర్ లేకుండానే ఆడే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News August 25, 2025
‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్‌కు ఆర్థికసాయం

TG: ‘పుష్ప-2’ విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ‘మిషన్ వాత్సల్య పథకం’ కింద బాలుడికి 18 ఏళ్లు వచ్చేంత వరకు ప్రతి నెలా రూ.4,000 అందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు గడచిన 3 నెలలకుగాను రూ.12వేలు వారి ఖాతాలో జమ చేసింది. కాగా ఈ ఘటనలో బాలుడి తల్లి రేవతి చనిపోగా, గాయపడిన శ్రీతేజ్ ఇంకా కోలుకుంటున్నాడు.
News August 25, 2025
రష్యాలో భారతీయ కార్మికులకు పెరిగిన డిమాండ్!

వలసలపై US, UK సహా పాశ్చాత్య దేశాల నుంచి భారతీయులపై ఆంక్షలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు రష్యా కంపెనీలు ముందుకొచ్చినట్లు ఇండియన్ అంబాసిడర్ వినయ్ కుమార్ తెలిపారు. ‘మెషినరీ, టెక్స్‌టైల్స్ రంగాల్లో మన కార్మికులకు డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడి చట్టాలకు లోబడి ప్రస్తుతం కంపెనీలు పెద్దఎత్తున మన కార్మికులను హైర్ చేసుకుంటున్నాయి’ అని తెలిపారు.
News August 25, 2025
యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌లో 4 కెమెరాలు!

యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో ‘బ్లూమ్‌బర్గ్’ మార్క్ గుర్మన్ అంచనా వేశారు. ‘ఫ్లిప్ కాకుండా యాపిల్ కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ బుక్ స్టైల్లో ఉంటుంది. ఇందులో ఫేస్ ఐడీ కాదు టచ్ ఐడీ ఉంటుంది. సీ2 మోడెమ్, 4 కెమెరాలు ఉంటాయి. కేవలం ఈ-సిమ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది’ అని తెలిపారు. దీని ధర రూ.1,74,900 వరకు ఉండొచ్చని, 2026లో విడుదలయ్యే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.