News August 22, 2024
ఓవైపు ఒప్పందాలు.. మరోవైపు నిరసనలు!

TG: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి భిన్నంగా ఉంది. AICC ఆదేశాలతో అదానీ వ్యవహారంలో JPC విచారణకు డిమాండ్ చేస్తూ HYDలోని ED ఆఫీస్ ముందు ఈరోజు CM రేవంత్, మంత్రులు నిరసనకు దిగారు. అయితే దావోస్ పర్యటనలో భాగంగా JAN 17న ప్రభుత్వం అదానీ సంస్థతో రూ.12,400 కోట్లతో MOU కుదుర్చుకుంది. కాగా తాము అధిష్ఠానం ఆదేశాలు పాటిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే స్పష్టం చేశారు.
Similar News
News December 9, 2025
డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు: కేటీఆర్

TG: తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు DEC 9 అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గుర్తుచేశారు. ‘అమరుల త్యాగం, KCR ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29(దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9(విజయ్ దివస్) లేదు. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.
News December 9, 2025
పాకిస్థాన్కు మరిన్ని నిధులు ఇచ్చిన IMF

దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మరోసారి భారీ ఆర్థిక సహాయం అందించింది. తాజాగా 1.2 బిలియన్ డాలర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్కు ఇప్పటివరకు వచ్చిన మొత్తం నిధులు సుమారు 3.3B డాలర్లకు చేరాయి. ఆ దేశం గత కొన్నేళ్లుగా ఎక్కువగా బయటనుంచి వచ్చే <<16600466>>ఆర్థిక సాయం<<>>పైనే ఆధారపడుతోంది. 2023లో త్రుటిలో డిఫాల్ట్ను తప్పించుకుంది.
News December 9, 2025
హైదరాబాద్లోని NI-MSMEలో ఉద్యోగాలు..

HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్(NI-<


