News August 17, 2024
19 సంస్థలతో ఒప్పందాలు.. 30,750 ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్బాబు

TG: రాష్ట్రంలో బయోడిజైన్ సిటీని ఏర్పాటు చేయాలని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని కోరినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ‘USలో 19 సంస్థలతో రూ.31,500కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాం. ఈ పెట్టుబడులతో 30,750 ఉద్యోగాలు రానున్నాయి. సౌత్ కొరియాలో దాదాపు 12 కంపెనీలతో ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులపై చర్చించాం. మూసీ సుందరీకరణపై వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో మాట్లాడాం’ అని మీడియా సమావేశంలో తెలిపారు.
Similar News
News January 11, 2026
నేడే తొలి వన్డే.. మ్యాచ్ టైమ్ ఇదే!

ఇండియా, న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ ఇవాళ వడోదరా వేదికగా మొదలుకానుంది. తొలి విజయం సాధించి సిరీస్ను పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. రోహిత్, కోహ్లీలు భీకర ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం. అటు కాన్వే, మిచెల్, బ్రేస్వెల్లతో NZ జట్టు సైతం పటిష్ఠంగా ఉంది. 1.30PMకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో LIVE చూడొచ్చు.
News January 11, 2026
నేడు, రేపు వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం శనివారం వాయుగుండంగా బలహీనపడి శ్రీలంకలోని జాఫ్నా, ట్రింకోమలై వద్ద తీరం దాటింది. ఆ ప్రభావం రాష్ట్రంపై కన్పిస్తోంది. ఫలితంగా ఇవాళ, రేపు TPT, చిత్తూరు, KDP, ATP, అన్నమయ్య, NDL, శ్రీసత్యసాయి, NLR, ప్రకాశం, BPT, GNT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అటు ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలులతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది.
News January 11, 2026
వ్యాధుల నుంచి విముక్తి కోసం ‘ఆదివార వ్రతం’

ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుని అనుగ్రహం కోసం ప్రతి నెలలో కనీసం ఒక ఆదివారమైనా ఆయనను భక్తితో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. ఆదివార వ్రతం ఆచరిస్తే ఆయురారోగ్యాలు సిద్ధించడమే కాకుండా చర్మ, నేత్ర సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. సకల వ్యాధుల విముక్తి కోసం ఈ ఆదివార వ్రతం ఉత్తమ పరిహారంగా పరిగణిస్తారు. ఈ వ్రతాన్ని భక్తితో ఎలా ఆచరించాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>లోకి వెళ్లండి.


