News December 16, 2024
ఇకపై టీసాట్లో వ్యవసాయ ప్రసారాలు
TG: పోటీ పరీక్షలు, ఉపాధికి సంబంధించిన కంటెంట్ను అందించే టీసాట్ ఇకపై వ్యవసాయ ప్రసారాలనూ అందిస్తుందని ఆ సంస్థ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నిపుణ ఛానల్లో ప్రతి సోమ, శనివారాల్లో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రసారాలుంటాయని తెలిపారు. మంగళవారం సా.4 నుంచి 5 గంటల వరకు హార్టికల్చర్ అంశాలు ప్రసారం చేస్తామన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, అనుభవమున్న రైతులు సలహాలు ఇస్తారని పేర్కొన్నారు.
Similar News
News February 5, 2025
ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్!
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు తెలిపాయి. మరో వైపు హజిల్వుడ్ తన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. కమిన్స్ స్థానంలో స్మిత్ లేదా హెడ్ సారథ్య బాధ్యతలు స్వీకరించే అవకాశమున్నట్లు సమాచారం. జట్టు మేనేజ్మెంట్ నుంచి ఈ విషయమై ప్రకటన రావాల్సి ఉంది.
News February 5, 2025
కులగణన సర్వేలో మళ్లీ వివరాలివ్వొచ్చు: మంత్రి పొన్నం
TG: కులగణన సర్వేలో పాల్గొనని వారు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. అన్ని వర్గాలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తప్పుడు వార్తల వ్యాప్తి బలహీన వర్గాలపై దాడేనని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై వైఖరి ఏంటో ప్రతి పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించాలని అనుకుంటే ఎదుర్కొంటామని చెప్పారు.
News February 5, 2025
పెళ్లి కార్డు ఇన్విటేషన్ అదిరిపోయిందిగా..
పెళ్లి వేడుకలకు ఆహ్వానించేందుకు యువ జంటలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆధార్ కార్డు ఇన్విటేషన్ మరవకముందే కేరళలో ఓ జంట రేషన్ కార్డు తరహాలో వెడ్డింగ్ కార్డును రూపొందించారు. వరుడు ‘రేషన్ షాప్ బాయ్’గా స్థానికంగా పాపులర్ అవడంతో పెళ్లి కూతురు ఇలా డిజైన్ చేయించిందని సమాచారం. వీరి పెళ్లి ఈ నెల 2న జరిగింది. ఈ కార్డు వైరలవ్వగా క్రియేటివిటీ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.