News September 7, 2024

ఉచిత పంటల బీమాపై వ్యవసాయ శాఖ కీలక ప్రకటన

image

AP: ఖరీఫ్‌లో జిల్లాల వారీగా ఎంపిక చేసిన పంటలకు ఉచితంగా PMFBY, RWBCIS పథకాలను అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ-క్రాప్‌లో నమోదు చేసుకుంటేనే బీమా వర్తిస్తుందని, రైతు చెల్లించాల్సిన ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. రబీ నుంచి బీమా కావాలంటే రైతులే తమ వాటా ప్రీమియం (ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 1.5%, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5% చొప్పున) చెల్లించాలని తెలిపింది.

Similar News

News November 23, 2025

విత్తనాలు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

మంచి నాణ్యత, మొలకెత్తే శక్తి అధికంగా కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సరైన సీలుతో మరియు ధ్రువీకరణ పత్రంతో ఉన్న విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకొని కొనుగోలు చేయాలి. విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనుగోలు చేయాలి. కొనుగోలు రశీదు తప్పక తీసుకోవాలి. దీనిపై రైతు, డీలర్ సంతకం తప్పక ఉండాలి.

News November 23, 2025

రేషన్ కార్డులు ఉన్న వారికి ఫ్రీగా క్లాత్ బ్యాగులు?

image

TG: వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి సన్నబియ్యంతో పాటు మల్టీ పర్పస్ క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాగులపై ప్రభుత్వ 6 గ్యారంటీల లోగోలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా OCTలోనే ఈ బ్యాగులను పంపిణీ చేయాల్సి ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది.

News November 23, 2025

నాకు పేరు పెట్టింది ఆయనే: సాయిపల్లవి

image

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ సాయిపల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. తన అమ్మ, తాతయ్య సాయిబాబాకు భక్తులని తెలిపారు. పుట్టపర్తి సాయి తనను దీవించి పేరు పెట్టినట్లు వెల్లడించారు. తాను కూడా సాయిబాబా భక్తురాలినేనని, ఆయన బోధనలు తనలో ధైర్యం నింపాయని చెప్పారు. ప్రశాంతత, క్రమశిక్షణ, ధ్యానం వంటివి ఆయన నుంచి నేర్చుకున్నట్లు పేర్కొన్నారు.