News October 9, 2025
BC రిజర్వేషన్లు: హైకోర్టులో వాదనలు ఇలా..

TG: BCలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై HCలో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తరఫున AG సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. BC కులగణన చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని చెప్పారు. డోర్2డోర్ సర్వేకు అన్ని పార్టీలూ మద్దతిచ్చినట్లు తెలిపారు. సర్కార్ నియమించిన సీనియర్ లాయర్ సింఘ్వీ వర్చువల్‌గా వాదిస్తున్నారు.
Similar News
News February 15, 2026
పవర్ ప్లేలో భారత్ స్కోర్ 52-1

T20WC: తొలి ఓవర్లోనే అభిషేక్ ఔటైనా ఇషాన్ కిషన్(42*) ధనాధన్ ఆటతో భారత్ పవర్ ప్లే ముగిసే వరకు 52 పరుగులు చేసింది. అటు తిలక్ వర్మ(10*) ఆచితూచి ఆడుతున్నారు. తొలి 6 ఓవర్లలో 5 ఓవర్లను పాక్ స్పిన్నర్లతోనే వేయించడం విశేషం.
News February 15, 2026
మహా శివరాత్రి జాగరణ చేస్తున్నారా?

ఇవాళ మహాశివరాత్రి జాగరణ మనలోని శివత్వాన్ని మేల్కొలుపుతుందని పండితులు చెబుతున్నారు. ఇవాళ రాత్రంతా జాగరణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుందంటున్నారు. అయితే సినిమాలు చూస్తూ, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ, డాన్సులు చేసేది జాగరణ కాదని స్పష్టం చేస్తున్నారు. కునికిపాట్లు పడకుండా శివ నామాలను భక్తితో స్మరించాలని సూచిస్తున్నారు. అర్ధరాత్రి 12.03 గంటల నుంచి 12.53 వరకు లింగోద్భవ కాలంలో పూజలు, అభిషేకం చేయాలంటున్నారు.
News February 15, 2026
తీవ్ర నిరాశకు గురి చేసిన అభిషేక్

T20WC: హైఓల్టేజ్ మ్యాచ్‌లో పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తారనుకున్న ఓపెనర్ అభిషేక్ ఘోరంగా విఫలమయ్యారు. కనీసం ఖాతా తెరవకుండా ఔటవడంపై టీమ్ఇండియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. పవర్ ప్లే వరకు ఆడినా పెద్ద స్కోర్ వస్తుందని ఆశించగా తొలి ఓవర్లోనే చెత్త షాట్ ఆడి పెవిలియన్‌కు చేరారు. మీరేమంటారు?


