News August 9, 2024

మున్ముందు మన జాతీయ గీతం కచ్చితంగా వినిపిస్తుంది: నీరజ్ చోప్రా

image

ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శనపై సిల్వర్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా సంతృప్తి వ్యక్తం చేశారు. జావెలిన్ త్రోలో తానింకా మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. ‘ప్రతి ఆటగాడికి ఓ రోజు వస్తుంది. ఈరోజు అర్షద్‌ది. నా శాయశక్తులా ప్రయత్నించా. ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. మన దేశం ఒలింపిక్స్‌లో బాగా ఆడింది. నేడు మెడల్ స్వీకరణ వద్ద జనగణమన వినిపించకపోవచ్చు కానీ భవిష్యత్తులో కచ్చితంగా వినిపిస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News March 4, 2026

అల్లు ఫ్యామిలీని చూశారా?

image

అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన వారందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ‘అందమైన జంటపై ఆశీస్సులు కురిపించారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు పంపారు. మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. మీ ప్రేమ, ఆప్యాయతకు థాంక్స్’ అని ట్వీట్ చేశారు. ఈ నెల 2న అల్లు స్టూడియోస్‌లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

News March 4, 2026

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్లస్టర్ బాంబులు!

image

ఇరాన్ తమ భూభాగంపైకి బాలిస్టిక్ మిస్సైళ్లతో క్లస్టర్ బాంబులు వదులుతోందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. టెల్ అవీవ్ సమీపంలో ఈ బాంబు వల్ల 12 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఇది గాల్లో ఉన్నప్పుడే 80 చిన్న బాంబులుగా విడిపోయి కొన్ని కి.మీ. మేర విధ్వంసం సృష్టిస్తాయి. కొన్నిసార్లు పేలకుండా దశాబ్దాల పాటు భూమిలో ఉండిపోతాయి. ఏదైనా తాకితే పేలిపోతాయి. ఈ యుద్ధంలో వీటిని ఉపయోగించడం ఇదే తొలిసారి.

News March 4, 2026

దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. 18న ప్రారంభం

image

AP: దివ్యాంగులకు బస్సులో ఉచిత ప్రయాణం(ఇంద్ర ధనుస్సు స్కీమ్)పై RTC MD బాలసుబ్రహ్మణ్యం కీలక ప్రకటన చేశారు. ఈ పథకాన్ని ఈ నెల 18న సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చన్నారు. వారికి సహాయంగా వచ్చేవారికీ 50 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు.