News October 5, 2024

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ఇకపై అహిల్యానగర్‌

image

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాను అహిల్యానగర్‌గా మారుస్తూ ఆ రాష్ట్ర సర్కారు ఈ ఏడాది మార్చిలో చేసిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. రాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ ఈ విషయాన్ని ప్రకటించారు. 18వ శతాబ్దానికి చెందిన మరాఠా రాణి పుణ్యశ్లోక్ అహిల్యా దేవి పేరును ఆ జిల్లాకు పెట్టాలంటూ చాలాకాలంగా డిమాండ్ ఉంది. ఈ ఏడాది సరిగ్గా ఆమె 300వ జయంతి సందర్భంలో పేరు మారడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News January 2, 2025

మంత్రుల కుంభకోణాలు బయటపెడతా: ఎమ్మెల్యే ఏలేటి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.కోట్లల్లో భారీ కుంభకోణాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ స్కాముల్లో పాలు పంచుకున్న మంత్రుల పేర్లను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని తెలిపారు. దీనిపై సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తామని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.

News January 2, 2025

ఈ ఏడాది ‘తల్లికి వందనం’ లేనట్లేనా?

image

AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆర్థిక లోటుతో ఈ స్కీమ్‌ను ఇప్పట్లో అమలు చేయలేమని చెప్పేశారు. కాగా ఎన్నికలకు ముందు ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తామని NDA కూటమి హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రావడంతో 80 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని బాంబు పేల్చారు.

News January 2, 2025

సిడ్నీ టెస్టుకు భారత జట్టులో భారీ మార్పులు?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ టెస్టు కోసం టీమ్ ఇండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో శుభ్‌మన్ గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జట్టుకు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తారని టాక్. ప్రాబబుల్ జట్టు: బుమ్రా, రాహుల్, జైస్వాల్, గిల్, కోహ్లీ, పంత్, జడేజా, నితీశ్, సుందర్, ప్రసిద్ధ్, సిరాజ్.