News December 22, 2025

AIపై పిల్లలతో పేరెంట్స్ చర్చించాలి: ఎక్స్‌పర్ట్స్

image

AI టెక్నాలజీపై పిల్లలతో పేరెంట్స్ ఓపెన్‌గా మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘దాని లిమిటేషన్స్‌పై చర్చించాలి. స్కూళ్లలో సబ్జెక్టుల్లోనూ వాటిని చేర్చాలి. AI చెప్పింది ఫాలో కాకుండా ప్రశ్నించడం ఎంత ముఖ్యమో తెలపాలి. డేటా ప్రైవసీ, ఎథిక్స్, రెస్పాన్సిబుల్‌గా AIను ఎలా ఉపయోగించాలో చెప్పాలి. క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో టెక్నాలజీని బ్యాలెన్స్ చేసుకునే నైపుణ్యాలపై చర్చించాలి’ అని చెబుతున్నారు.

Similar News

News December 23, 2025

REWIND 2025: ప్రపంచంలో ముఖ్య ఘటనలు

image

*డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం
* కాథలిక్ చర్చి 267వ పోప్‌గా పోప్ లియో XIV ఎన్నిక
* Gen-Z నిరసనలతో నేపాల్‌ ప్రభుత్వ మార్పు
* హాంకాంగ్‌ వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్‌ అగ్నిప్రమాదంలో 161 మంది మృతి
* జమైకాను వణికించిన మెలిస్సా తుఫాను.. మృతులు 102, 9లక్షల మంది బాధితులు
* మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 గెలిచిన భారత్
* US జోక్యంతో ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ

News December 23, 2025

కులపిచ్చి ముందు ఓడిన కన్నప్రేమ

image

టెక్నాలజీ పరుగులు తీస్తున్నా సమాజాన్ని ఇంకా కులం అనే సంకెళ్లు వీడటం లేదు. కర్ణాటకలో పరువు హత్యే దీనికి నిదర్శనం. దళితుడిని ప్రేమపెళ్లి చేసుకుందని 6 నెలల గర్భిణి అయిన మాన్యను కన్నతండ్రే కర్కశంగా హతమార్చాడు. బంధువులతో కలిసి ఇనుప రాడ్డులతో దాడి చేసి పుట్టబోయే బిడ్డతో సహా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఈ ఘటన కొందరిలో కులపిచ్చి ఎంత బలంగా నాటుకుపోయిందో తెలియజేస్తోంది.

News December 23, 2025

పాపం ఆ తండ్రి.. గౌరవం కాపాడాల్సిన కొడుకే..!

image

UPలోని దేవరియాలో తండ్రిపైనే కేసు పెట్టాడో కొడుకు. తనను అందరి ముందు తిట్టి, కొట్టాడని PSకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. జరిగిన దాని గురించి వివరించేందుకు ఆ తండ్రి ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరికి అందరి ముందు మోకాళ్లపై కూర్చొని, క్షమించమని కొడుకును వేడుకున్నాడు. ఆ తర్వాతే అతడు ఇంటికి రావడానికి అంగీకరించాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి కొడుకు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.