News June 18, 2024
ఏఐ అందాల పోటీ.. రేసులో భారత్ బ్యూటీ!

అందాల పోటీల్లోనూ AI ఎంట్రీ ఇచ్చేసింది. ఫాన్వ్యూ సంస్థ ప్రపంచ దేశాల్లోని ఏఐ మోడల్స్‌కు అందాల పోటీ నిర్వహిస్తోంది. టాప్ టెన్ చేరిన ఫైనలిస్టుల్లో భారత్‌కు చెందిన జారా శతావరి చోటుదక్కించుకుంది. రాహుల్ చౌదరి ఈమెను రూపొందించారు. ఇన్‌స్టాలో 7500కుపైగా ఫాలోవర్లు ఉన్న జారా ఇప్పటికే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. కాగా టాప్ 3లో నిలిచిన మోడల్స్‌కు $20వేలు (₹16లక్షలపైనే) ప్రైజ్ మనీ అందనుంది.
Similar News
News March 28, 2026
ఈ వింత చట్టాల గురించి తెలుసా?

*సింగపూర్‌లో 1992 నుంచి చూయింగ్ గమ్ వాడటం, దిగుమతి చేయడంపై నిషేధం
*జర్మనీలో పెట్రోల్ అయిపోయి రోడ్డుపై వాహనం ఆగిపోయినా నేరమే. డ్రైవర్ ముందే జాగ్రత్త పడాలి
*జపాన్‌లో అధిక బరువు ఉండటం చట్టవిరుద్ధం. కంపెనీలు తమ ఉద్యోగుల నడుము కొలతలను ఏటా చెక్ చేస్తాయి. కొలత ఎక్కువగా ఉంటే డైట్ పాటించాలి.
*థాయ్‌లాండ్‌లో డబ్బును తొక్కితే జైలు శిక్ష తప్పదు. కరెన్సీ నోట్లపై రాజు ముఖం ఉండటమే దీనికి కారణం
News March 28, 2026
IPL రికార్డ్స్.. ఈసారైనా బద్దలవుతాయా?

☛ ఒకే సీజన్(2016)లో కోహ్లీ రన్స్-973
☛ పుణే వారియర్స్‌పై గేల్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్-175*, ఫాస్టెస్ట్(30 బంతుల్లో) సెంచరీ, ఒకే ఇన్నింగ్సులో హయ్యెస్ట్ సిక్సులు-17
☛ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్(12 పరుగులిచ్చి 6 వికెట్లు.. అల్జారీ జోసెఫ్-MI)
☛ అత్యధిక టీమ్ స్కోర్- 287/3(SRH)
☛ ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం-229 రన్స్(2016లో గుజరాత్ లయన్స్‌పై కోహ్లీ-ABD నెలకొల్పారు)
News March 28, 2026
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఫీజు పెంపు.. మరో 4 రోజుల్లో అమల్లోకి

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఫీజు రూ.3,000 నుంచి రూ.3,075కి పెరగనుంది. ఫీజు పెంపు నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని NHAI వెల్లడించింది. ప్రస్తుత ధరతో పాస్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు మరో 4 రోజులే అవకాశం ఉందని పేర్కొంది. వన్ టైమ్ పేమెంట్‌తో ఏడాదిపాటు లేదా 200 ట్రిప్స్ ఎలాంటి అంతరాయం లేకుండా NHలపై ప్రయాణించవచ్చని తెలిపింది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా పాస్‌ను యాక్టివేట్ చేసుకోవాలంది.


