News August 21, 2024

ఇంజిన్ల వద్ద ఏఐ కెమెరాలను ఏర్పాటు చేస్తాం: రైల్వే

image

దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంజిన్ల వద్ద ఏఐ పరిజ్ఞానంతో పనిచేసే కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే బోర్డు ఛైర్ పర్సన్ జయవర్మ ప్రకటించారు. రైల్వే ట్రాక్స్‌పై అసాధారణ పరిస్థితుల్ని గుర్తించడంలో ఇవి ఉపకరిస్తాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు 900 రైళ్లు ప్రత్యేకంగా నడపనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

Similar News

News December 23, 2025

వారు ఆ టైంలోనే తిరుమలకు రావాలి: BR నాయుడు

image

AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తామని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. ‘DEC 30 నుంచి JAN 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నాం. 10 రోజులలో మొత్తం 182గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్యులకే కేటాయించాం. ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన వారు తప్పనిసరిగా నిర్దేశిత తేదీ, టైంలోనే తిరుమలకు చేరుకోవాలి. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు.

News December 23, 2025

ఉష్ణోగ్రత ఎంత ఉంటే.. చలి అంత ఉన్నట్టా?

image

ఉష్ణోగ్రత ఎంత తగ్గితే చలి తీవ్రత అంత ఎక్కువ అవుతుందనేది ఒకింత నిజమే. అయితే టెంపరేచర్ ఒక్కటే చలిని నిర్ణయించదు. వాతావరణంలోని తేమ, ఎండ.. ముఖ్యంగా గాలి వేగం ప్రభావితం చేస్తాయి. థర్మామీటర్ చూపే ఉష్ణోగ్రత కంటే గాలి వేగం ఎక్కువగా ఉంటే శరీరం నుంచి వేడి త్వరగా పోయి మరింత చల్లగా అనిపిస్తుంది. ఉదాహరణకు గాలి లేకుండా 0°C ఉంటే చల్లగా ఉంటుంది. అదే 0°Cకి 40kmph గాలి కలిస్తే -10°C లాగా అనిపిస్తుంది.

News December 23, 2025

ఢిల్లీ బాటలో ఒడిశా.. మరి మన దగ్గర!

image

పొల్యూషన్ సర్టిఫికెట్‌ ఉన్న వాహనాలకే పెట్రోల్/డీజిల్ విక్రయించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన JAN 1 నుంచి అమలు కానుండగా, ఢిల్లీలో ఇప్పటికే పాటిస్తున్నారు. దేశ రాజధాని మాదిరి అధ్వాన వాయు కాలుష్య పరిస్థితులు రాకూడదంటే తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లోనూ ఈ రూల్ తేవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముందుగానే మేల్కొంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లు అవుతుందని సూచిస్తున్నారు.