News July 11, 2024
ఏఐ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్

భారత్ టెక్ రంగంలో 2-3 ఏళ్లలో ఏఐపై పట్టున్న ఇంజినీర్ల అవసరం ఉందంటున్నారు నిపుణులు. పది లక్షలకుపైగా ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. AI, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో రాణించాలంటే ఇప్పుడున్న ఉద్యోగుల్లో సగం మందిపైన తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇందుకు తగినట్టు ప్రభుత్వం శిక్షణ ఇప్పించడం వంటి చర్యలు చేపట్టకుంటే డిమాండ్‌ను అందుకోవడం కష్టమని తెలిపారు.
Similar News
News December 29, 2025
శీతాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే?

శీతాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల పిల్లలు త్వరగా రోగాలబారిన పడతారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పిల్లలు పరిశుభ్రత పాటించడం, నీరు ఎక్కువగా తాగడం ముఖ్యం. అలాగే పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలి. వీటితో పాటు పప్పుధాన్యాలు, పాలు, పెరుగు, గుడ్లు, నట్స్ వంటి పోషకాహారాన్ని వారి ఆహారంలో చేర్చాలి. జంక్ ఫుడ్‌ను నివారించాలని సూచిస్తున్నారు.
News December 29, 2025
‘పెద్ది’లో జగపతిబాబు షాకింగ్ లుక్

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి నటుడు జగపతిబాబు ఫస్ట్ లుక్ విడుదలైంది. చూసిన వెంటనే గుర్తుపట్టలేనంతగా ఉన్న ఆయన లుక్ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. ‘అప్పలసూరి’ అనే పాత్రలో జగపతిబాబు కనిపించనున్నట్లు మూవీటీమ్ ప్రకటించింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.
News December 29, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18700295>>మళ్లీ<<>> తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.2,020 తగ్గి రూ.1,40,400కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,850 పతనమై రూ.1,28,700 పలుకుతోంది. అటు వెండి ధర రూ.4వేలు తగ్గి కిలో రూ.2,81,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


