News July 2, 2024
వాట్సాప్‌లో ‘ఏఐ జనరేటెడ్ ఇమేజెస్’ ఫీచర్!

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ‘ఏఐ జనరేటెడ్ ఇమేజెస్’ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు వాబీటా ఇన్ఫో వెల్లడించింది. ఈ ఫీచర్లో భాగంగా యూజర్లు మొదట తమ ఫొటోను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘మెటా ఏఐ’ చాట్‌లో ‘imagine me’ అని టైప్ చేస్తే మీ ఏఐ ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఇది ఇతర చాట్లలో కావాలంటే “@Meta AI imagine me” అని టైప్ చేస్తే సరిపోతుంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
Similar News
News March 11, 2026
అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

దేశంలో నెలకొన్న వంట గ్యాస్ కొరత అయోధ్యనూ తాకింది. రామమందిరం సమీపాన ఉండే అమావా ఆలయంలోని ప్రముఖ నిత్యాన్నదాన ప్రాంగణం రామ్ రసోయ్‌లో తాత్కాలికంగా అన్నదానం నిలిపివేశారు. అయోధ్యకు వచ్చే యాత్రికుల్లో వేలాది మందికి ఈ రామ్ రసోయ్ ప్రసాదాన్ని అందిస్తుంది. కాగా LPGకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని <<19316913>>TTD<<>> ఇప్పటికే IOCLను కోరింది.
News March 11, 2026
బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలంటే?

బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తారు. అయితే భారతీయ మహిళల్లో రొమ్ములు చాలా దట్టంగా ఉండటం వల్ల.. ఈ పరీక్ష సమయంలో క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు మిస్ అవుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే మహిళలు కూడా తమ రొమ్ములను ఎప్పటికప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.
News March 11, 2026
విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన భర్త సోహైల్‌తో 4 ఏళ్ల వివాహ బంధానికి తెరదించారు. అతడితో విడాకుల పక్రియ ఇవాళ పూర్తయింది. తన చిన్ననాటి స్నేహితుడైన సోహైల్‌ను హన్సిక 2022లో వివాహమాడారు. అయితే అతడికి అప్పటికే రింకీ బజాన్‌తో పెళ్లి జరగ్గా కొంత కాలానికే వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సోహైల్, హన్సిక లవ్ మ్యారేజీ చేసుకున్నారు.


