News January 19, 2025
సైఫ్, కరీనా నవ్వుతున్న AI ఫొటో.. ఎంపీపై విమర్శలు

సైఫ్ అలీఖాన్‌పై దాడి దురదృష్టకరమని నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా అన్నారు. ఆయన త్వరగా కోలుకుంటున్నందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. సైఫ్ బెడ్‌పై, కరీనా పక్కనే కూర్చుని నవ్వుతున్నట్లు ఉన్న AI జనరేటెడ్ ఫొటోను షేర్ చేశారు. దీంతో కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే ఇలాంటి ఫొటోలు పంచుకోవడం అవసరమా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. అయితే దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు.
Similar News
News September 18, 2025
జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

AP: జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పన్నుల విధానంలో 2 శ్లాబులు (5%,18%) మాత్రమే ఉంచి సరళతరం చేశారని పేర్కొన్నారు.
News September 18, 2025
తప్పిన మరో పెను విమాన ప్రమాదం

విశాఖ నుంచి HYD ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానానికి పెనుప్రమాదం తప్పింది. విశాఖలో టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ ఇంజిన్ ఫ్యాన్ రెక్కల్లో పక్షి చిక్కుకుంది. దీంతో ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. అప్రమత్తమైన పైలట్ విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఆ టైంలో విమానంలో 103మంది ప్రయాణికులున్నారు. కొన్నినెలల కింద అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్‌లో 270మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.
News September 18, 2025
అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు: సీఎం చంద్రబాబు

AP: కేంద్రం తీసుకొచ్చిన GST సంస్కరణలు గేమ్ ఛేంజర్ అని, ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తాయని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయి. సంస్కరణలు అంటే నేనెప్పుడూ ముందుంటా. అభివృద్ధి జరిగితే సంపద పెరుగుతుంది. సంపద సృష్టించలేని వారికి సంక్షేమం ఇచ్చే అర్హత లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు’ అని అన్నారు.