News August 20, 2024
శత్రువుల్ని గుర్తించి కాల్చే ఏఐ రోబో!

2 కి.మీ దూరంలో ఉన్న శత్రువుల్ని కాల్చగల ఏఐ రోబోను యూపీలోని ITM కాలేజీకి చెందిన విద్యార్థులు రూపొందించారు. ఉక్కు, ఫైబర్, ఇతర లోహాలతో దీన్ని రూపొందించామని, రూ. 1.8 లక్షలు ఖర్చయిందని వారు వివరించారు. శత్రువుల్ని గుర్తించిన అనంతరం భుజంపై ఉండే 18ఎంఎం ఎలక్ట్రానిక్ మెషీన్ గన్ ద్వారా రోబో వారిపై కాల్పులు జరుపుతుందని తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉపయోగపడేలా దీని నమూనాను రక్షణ శాఖకు పంపిస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 9, 2025
ఆముదం పంటలో దాసరి పురుగు నివారణ ఎలా?

దాసరి పురుగు ఆముదం పంటను జనవరి మాసం వరకు ఆశిస్తుంది. ఈ పురుగు పంటపై ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.
News November 9, 2025
PGIMERలో ఉద్యోగాలు

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<
News November 9, 2025
జూబ్లీ‘హిట్’ అయ్యేదెవరో?

హాట్ సీటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది దశకు చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. దివంగత MLA మాగంటి గోపీనాథ్ భార్యకే టికెట్ ఇచ్చిన BRS సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న INC నవీన్ యాదవ్ గెలుపునకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అటు జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగురవేస్తామని BJP చెబుతోంది. మీ కామెంట్?


