News October 27, 2024
సైబర్ నేరాల నియంత్రణకు AI పరిష్కారాలు!

సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు AI పరిష్కారాల కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. IndiaAI ఇనిషియేటివ్‌లో భాగంగా నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ (NCRP)లో పౌరులు సులభంగా సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసే విధంగా, నేర విధానాల ఆధారంగా వాటి విభజనకు అవసరమైన Natural Language Processing వృద్ధికి ఔత్సాహికులను ఆహ్వానించింది. రోజూ నమోదయ్యే 6K కేసుల నిర్వహణ, నేరాల నియంత్రణకే ఈ ప్రయత్నాలని ఓ అధికారి తెలిపారు.
Similar News
News December 4, 2025
డ్రై స్కిన్ కోసం మేకప్ టిప్స్

పొడి చర్మం ఉన్నవారు మేకప్ వేసుకోవాలనుకుంటే ముందుగా సీరం అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ కచ్చితంగా అవసరం. చర్మం పొడిగా, డీహైడ్రేటెడ్‌గా ఉంటే.. హైడ్రేటింగ్ ప్రైమర్‌ను ఎంచుకోవాలి. ఇది మీ మేకప్ లుక్‌ని హైడ్రేటింగ్ బేస్‌గా ఉపయోగించవచ్చు. పొడి చర్మం కోసం ఫౌండేషన్ ఎంచుకునేటప్పుడు హైడ్రేటింగ్, తేలికైన, మెరిసే లిక్విడ్ ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. ఫౌండేషన్ పైన క్రీమ్ బ్లష్, హైలైటర్లను ఉపయోగించాలి.
News December 4, 2025
తాజ్‌మహల్ ఆగ్రాకు శాపంగా మారింది: బీజేపీ ఎంపీ

తాజ్‌మహల్‌పై బీజేపీ ఫతేపూర్ సిక్రి(UP) ఎంపీ రాజ్‌కుమార్ చాహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తాజ్‌మహల్ కట్టడం ప్రపంచ ఆకర్షణ. కానీ కఠినమైన తాజ్ ట్రాపేజియం జోన్(TTZ), ఎన్జీటీ నిబంధనల వల్ల ఆగ్రా అభివృద్ధికి శాపంగా మారింది. పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ సృష్టికి ఆటంకం కలిగిస్తోంది’ అని లోక్‌సభలో అన్నారు. ఉపాధి, అభివృద్ధిని పెంచేందుకు, తాజ్ అందాన్ని కాపాడేందుకు ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
News December 4, 2025
లెజెండరీ నిర్మాత కన్నుమూత

లెజెండరీ నిర్మాత, AVM స్టూడియోస్ అధినేత ఎం.శరవణన్(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 300కు పైగా చిత్రాలను శరవణన్ నిర్మించారు. రజినీకాంత్, శివాజీ గణేశన్ వంటి ఎంతోమందిని వెండితెరకు పరిచయం చేశారు. సంసారం ఒక చదరంగం, జెమినీ, శివాజీ, ఆ ఒక్కటీ అడక్కు, మెరుపుకలలు, లీడర్ తదితర చిత్రాలు తెరకెక్కించారు.


