News February 11, 2025

ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావాలి: పీఎం మోదీ

image

ఏఐ టెక్నాలజీ అన్ని దేశాలకూ అందుబాటులోకి రావాలని పారిస్‌లో జరిగిన ఏఐ శిఖరాగ్ర సదస్సులో PM మోదీ అన్నారు. ‘ఏఐ అనేది ఇప్పటికే మన రాజకీయ, ఆర్థిక, భద్రత, సామాజిక వ్యవస్థల్ని సమూలంగా మార్చేస్తోంది. ఈ శతాబ్దంలో మానవాళికి ఏఐ కోడ్ వంటిది. శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతే వేగంగా ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. ఏఐలో మా అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి మేం ఎల్లప్పుడూ సిద్ధం’ అని పేర్కొన్నారు.

Similar News

News February 11, 2025

ఉద్యోగం కోసం రోజూ 700KMS ప్రయాణం!

image

హైదరాబాద్‌లో ఉంటోన్న ఉద్యోగులను అడగండి రోజూ ట్రాఫిక్‌లో ప్రయాణం ఎలా ఉంటుందో. అలాంటిది ఉద్యోగం కోసం రోజూ 700 కి.మీలు ప్రయాణిస్తోందో మహిళ. భారత సంతతికి చెందిన రాచెల్ కౌర్ మలేషియాలోని కౌలాలంపూర్‌లో పనిచేస్తున్నారు. పెనాంగ్‌లో నివాసముంటుండగా వారంలో 5 రోజులు విమానంలో ఆఫీసుకెళ్తుంటుంది. ఉదయం 4గంటలకే లేచి ఆఫీసుకు వెళ్తానని ఆమె చెప్పారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేసేందుకు ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News February 11, 2025

ఏ బీరుపై ఎంత రేటు పెరిగిందంటే?

image

TG: రాష్ట్రంలో బీర్ల ధరలు ఇవాళ్టి నుంచి 15% పెరిగాయి. KF స్ట్రాంగ్ రేటు రూ.160 నుంచి రూ.184కు, లైట్ రూ.150 నుంచి రూ.172కు, అల్ట్రా మాక్స్ రూ.220 నుంచి రూ.253కు చేరాయి. అలాగే బడ్వైజర్ లైట్ రూ.210 నుంచి రూ.241కు, మ్యాగ్నం రూ.220 నుంచి రూ.253కు, టుబర్గ్ స్ట్రాంగ్ రూ.240 నుంచి రూ.276కు పెరిగాయి. ఈ పెంపుతో ప్రభుత్వానికి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.

News February 11, 2025

ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు కోహ్లీనే: గేల్

image

ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీయేనని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డారు. రికార్డులే ఆ మాట చెబుతాయని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘ఫార్మాట్లతో సంబంధం లేకుండా ఇప్పటికీ విరాటే అత్యుత్తమ ఆటగాడు. ఆయన ఫామ్ కొంచెం డౌన్ అయిందంతే. తిరిగి పుంజుకుని కెరీర్‌ను బలంగా ముగిస్తారని అనుకుంటున్నా. ఇక రోహిత్ అద్భుతమైన ఎంటర్‌టైనర్. సిక్సుల్లో ఆయనే ఇప్పుడు కింగ్’ అని కొనియాడారు.

error: Content is protected !!