News January 27, 2025

పరిధి దాటేసిన ఏఐ.. మరింత ప్రమాదం?

image

AI ఉపయోగాలు కోకొల్లలు. కానీ దాని వల్ల వాటిల్లే ఉపద్రవాల గురించే ఆందోళన ఎక్కువగా ఉంది. దానిని నిజం చేసేలా AI మోడల్ తాజాగా తనను తానే క్లోనింగ్ చేసుకుంది. అలీబాబా, మెటా సంస్థలకు చెందిన రెండు లాంగ్వేజ్ మోడల్స్‌ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ‘మోడల్ షట్‌డౌన్ కాకుండా ఉండేందుకు అపరిమిత క్లోనింగ్ చేసుకోగలుగుతోంది. అవసరమైతే వ్యవస్థను రీస్టార్ట్ చేస్తోంది. ఇది చాలా ప్రమాదకరం’ అని పరిశోధకులు హెచ్చరించారు.

Similar News

News December 13, 2025

జుట్టుకు బలాన్నిచ్చే విటమిన్లివే..!

image

ప్రస్తుతకాలంలో కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చాలామంది హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఈ విటమిన్లుండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. విటమిన్ బి7, విటమిన్ డి, ఐరన్, జింక్, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటు జీవనశైలి మార్పులు, వ్యాయామం, తగినంత నీరు తాగడం వంటివి చేస్తే పట్టులాంటి జుట్టు సొంతమవుతుందంటున్నారు.

News December 13, 2025

పసుపులో ఆకుమచ్చ తెగులు – నివారణ

image

ఆకుమచ్చ తెగులు సోకిన పసుపు ఆకులపై చిన్నచిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి గోధుమ మచ్చలుగా మారతాయి. తెగులు తీవ్రమైతే ఆకు మాడిపోతుంది. దుంపలు, కొమ్ములు, మొక్కల ఎదుగుదల లోపించి దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. ఈ తెగులు కట్టడికి లీటరు నీటికి మాంకోజెట్ 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్ 1 గ్రాము లేదా ప్రోపికోనజోల్ 1mlను 0.5ml జిగురుతో కలిపి 15 రోజల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 13, 2025

సినిమా అప్‌డేట్స్

image

✦ ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్
✦ నేడు మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ రిలీజ్ డేట్ ప్రకటనతోపాటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
✦ నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ బుకింగ్స్‌లో $100K మార్క్‌ను దాటేసిన ‘రాజాసాబ్’
✦ తెలుగులోకి రీమేక్ కానున్న హాట్‌స్టార్ హిందీ వెబ్‌సిరీస్ ‘ఆర్య’.. ప్రధాన పాత్రలో కాజల్?