News April 7, 2025
2030లోగా AIకి మానవ మేధస్సు: గూగుల్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) 2030లోగా మానవులతో సమానమైన మేధస్సు(AGI)ను సాధిస్తుందని గూగుల్ డీప్‌మైండ్ అంచనా వేసింది. ఇది మానవ జాతిని శాశ్వతంగా నాశనం చేస్తుందని ఓ నివేదికలో పేర్కొంది. అయితే ఈ సామర్థ్యాన్ని ఏఐ ఎలా సాధిస్తుందన్న విషయాన్ని వెల్లడించలేదు. AGI ముప్పును నియంత్రించడానికి గూగుల్‌తో పాటు ఇతర ఏఐ కంపెనీలు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నివేదిక ఫోకస్ పెట్టింది.
Similar News
News April 10, 2025
దుమ్మురేపుతున్న గుజరాత్ టైటాన్స్!

గుజరాత్ టైటాన్స్ కోచింగ్‌లో పెద్దగా హడావిడి ఉండదు. యజమానులూ కనిపించరు. పేపర్‌పై చూస్తే 5 మ్యాచులు గెలిచినా గొప్పే అన్నట్లుండే ఈ జట్టు గ్రౌండ్‌లోకి వచ్చేసరికి అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. బట్లర్, గిల్, రషీద్, సిరాజ్ తప్పితే స్టార్లు లేని GT రూథర్‌ఫోర్డ్, సుదర్శన్, తెవాటియా వంటి బ్యాటర్లు, ప్రసిద్ధ్, ఇషాంత్, సాయి కిశోర్ వంటి బౌలర్లతోనే దుమ్మురేపుతోంది. ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉంది.
News April 10, 2025
నా తర్వాతి సినిమా ఇదే: రామ్‌గోపాల్ వర్మ

తన కెరీర్లో తొలిసారిగా హారర్ కామెడీ సినిమా చేస్తున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్లో తెలిపారు. ‘‘ప్రజలకు భయమేస్తే పోలీసుల వద్దకు పరిగెడతారు. మరి పోలీసులే భయపడితే’ అన్న కాన్సెప్ట్‌తో హారర్ కామెడీ జానర్లో సినిమాను తీస్తున్నా. మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘పోలీస్ స్టేషన్లో దెయ్యం’ అన్నది సినిమా టైటిల్. ‘చనిపోయిన వారిని చంపలేరు’ అన్నది ట్యాగ్‌లైన్’ అని RGV పేర్కొన్నారు.
News April 10, 2025
15న మంత్రివర్గ భేటీ.. కీలక పథకాలకు ఆమోదం?

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 15న సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. దీంతో రేపు సా.4 గంటల్లోగా అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను పంపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. కాగా క్యాబినెట్ భేటీలో మెగా డీఎస్సీతోపాటు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు, పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే అవకాశం ఉంది.