News November 28, 2024

పాటలకు AI వాయిస్.. SPB కొడుకు ఏమన్నారంటే?

image

లెజెండరీ సింగర్స్ వాయిస్‌ను AI ఉపయోగించి పాటలకు వాడటం కరెక్ట్ కాదని SP.బాలసుబ్రహ్మణ్యం తనయుడు SP.చరణ్ అన్నారు. SPB వాయిస్‌ను వాడేందుకు చాలా మంది సంప్రదించారని, కానీ తాను ఒప్పుకోలేదన్నారు. ఏ పాటనైనా పాడాలా వద్దా అనేది ఆ సింగర్ ఇష్టమని, అలాంటప్పుడు లేని వారి గొంతును మనకు నచ్చిన పాటలకు వాడుకోవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. ఒరిజినల్‌గా పాడితే వచ్చే ఎమోషన్ AI సాంగ్‌లో ఉండదని తెలిపారు.

Similar News

News October 30, 2025

వర్షాలు – 90 రోజుల పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు(1/2)

image

పత్తి పూత, కాయ ఏర్పడి, వృద్ది చెందే దశలో ఉంటే ముందుగా పొలంలో మురుగు నీటిని బయటకు తొలగించాలి. పంటలో చాళ్లను ఏర్పాటు చేసి మొక్కల్లో గాలి, కాంతి ప్రసరణ పెంచాలి. 2% యూరియా లేదా 2%పొటాషియం నైట్రేట్ లేదా 2% 19:19:19+ 1% మెగ్నీషియం సల్ఫేట్‌తో పాటు వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. లీటరు నీటికి 5గ్రా. బోరాక్స్ కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని ఏపీ వ్యవసాయశాఖ సూచించింది.

News October 30, 2025

వర్షాలు- 90 రోజుల పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు(2/2)

image

కాయకుళ్ళు నివారణకు లీటరు నీటికి 3గ్రా కాపర్ ఆక్సిక్లోరైడ్ +0.1గ్రా స్ట్రెప్టోసైక్లిన్ కలిపి మొక్కల కింది భాగపు కొమ్మలు, పచ్చటి కాయలు తడిచేలా పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు రాకుండా 3గ్రా. మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయరాలడం ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ప్లానోఫిక్స్(4.5% నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్) 0.25ml కలిపి పిచికారీ చేయాలని ఏపీ వ్యవసాయశాఖ సూచించింది.

News October 30, 2025

‘మహాకాళి’గా భూమికా శెట్టి

image

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రానున్న మహాకాళి సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మహాకాళిగా కన్నడ భామ భూమికా శెట్టి నటించనున్నారు. భూమికా శెట్టిని ‘మహా’గా పరిచయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈమె తెలుగులో ‘షరతులు వర్తిస్తాయి’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. PVCUలో తొలి లేడీ సూపర్ హీరోగా ఈమె కనిపించనున్నారు. ఈ మూవీకి పూజా అపర్ణ దర్శకత్వం వహించనున్నారు.